మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 25, 2020 , 23:59:56

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

  • అదనపు కలెక్టర్‌ ముజామ్మీఖాన్‌

సిద్దిపేట అర్బన్‌ : గ్రామాలాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు. మండలంలోని బొగ్గులోనిబండలో నిర్మించిన డంపింగ్‌ యార్డును  గురువారం సుడా చైర్మ న్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సవిత, జడ్పీటీసీ ప్రవళిక, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, సర్పంచ్‌ లతామాధవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అల్లం ఎల్లం, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఏపీవో నర్సింగ్‌రావు,  స్థానిక నేత భైరి శంకర్‌ పాల్గొన్నారు. 


logo