మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 25, 2020 , 23:40:01

ఊరూరా హరితోద్యమం

ఊరూరా హరితోద్యమం

  • ఆరో విడుత హరితహారంలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు

మనోహరాబాద్‌:  మనిషికో మొక్కను నాటి సంరక్షించుకోవాలని మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం దండుపల్లి, జీడిపల్లి గ్రామాల్లో రాష్ట్ర మాజీ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డితో కలిసి గురువారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు తెలంగాణలో అటవీ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు.   కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌ రేణుకమల్లేశ్‌, ఉప సర్పంచ్‌ మహేందర్‌గౌడ్‌, నాయకులు పంజా భిక్షపతి, శ్రీనివాస్‌గౌడ్‌, పెంటాగౌడ్‌ పాల్గొన్నారు. 

పలు గ్రామాల్లో జోరుగా ...

  మనోహరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.  చెట్లగౌరారం, కోనాయిపల్లి పీటీ గ్రామాల్లో పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, మనోహరాబాద్‌లో రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్‌ప్రసిడెంట్‌ చిట్కుల మహిపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.   సర్పంచ్‌లు పూల అర్జున్‌, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకటేశ్‌ ముదిరాజ్‌, నరాల ప్రభావతి, చింతల మమతారవి  పాల్గొన్నారు. 

 హరితవనాలు  ఏర్పాటు చేసుకోవాలి...

చేగుంట: ఆరో విడుత హరితహారంలో అన్ని గ్రామాల్లో హరిత వనాలు ఏర్పాటు చేసుకోవాలని చేగుంట ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు.  మండల పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలోని  హరితవనాల కోసం తీసిన గుంతలను గురువారం పరిశీలించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ మోహన్‌రాథోడ్‌,కార్యదర్శి రమేశ్‌,వనసేవకుడు బాలకృష్ణ పాల్గొన్నారు. మండల పరిధిలోని చందాయిపేటలో  గ్రామ సర్పంచ్‌  బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్‌ మొక్కలు నాటారు.బీ-కొండపూర్‌లో  గ్రామ సర్పంచ్‌ నీరుడి బాల్‌నర్సింలు,ఎంపీటీసీ నవీన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నార్సింగి అడవిలో ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్‌, వైస్‌ ఎంపీపీ డి సుజాత, ఎంపీటీసీలు ఆకుల సుజాత, సొసైటీ చైర్మన్‌ శంకర్‌గౌడ్‌, తౌర్యనాయక్‌, ఉప సర్పంచ్‌ యోగి, ఎంపీడీవో ఆనంద్‌మేరి, ఈవో నరేశ్‌ మొక్కలు నాటారు.  

 రామాయంపేట మున్సిపాలిటీలో...

రామాయంపేట:  హరితహారంలో భాగంగా రామాయంపేట మున్సిపాలిటీ ఐదవ వార్డులో  చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌,వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి,కమిషనర్‌ శేఖర్‌రెడ్డి    మొక్కలు నాటారు. గురువారం రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్‌, అక్కన్నపేట, కోనాపూర్‌, కిషన్‌ తండాలో ఎంపీపీ  ఎన్‌  భిక్షపతి, ఎంపీడీవో గిరిజారాణి, కిషన్‌నాయక్‌, కాట్రియాల, కోనాపూర్‌ సర్పంచులు శ్యాము లు, సుభాష్‌నాయక్‌, దోమ చంద్రకళలు మొక్కలు నాటారు.  కౌన్సిలర్లు చంద్రపు శోభా కొండల్‌రెడ్డి,  యాదగిరి  ఉన్నారు.

వెల్దుర్తి మండలంలో..

వెల్దుర్తి: హరితహారం కార్యక్రమం గురువారం మండల వ్యా ప్తంగా పండుగలా ప్రారంభమైంది. వెల్దుర్తి డంపింగ్‌ యార్డు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఎంపీపీ స్వరూపా నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌ ఆనంద్‌రావులతో కలిసి   మొక్కలను నాటారు.ఉపాధికూలీలతో కలిసి డంపింగ్‌యార్డు వద్ద 650 మొక్కలను నాటారు.   డీఈవో రమేశ్‌, ఎంఈవో యాదగిరి, నాయకులతో కలిసి మండలంలోని మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు.   

 ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

 కొల్చారం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్‌ అన్నారు.  ఏటిగడ్డ మాందాపూర్‌లో గురువారం సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి  హరితహారం కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు.   

 చిలిపిచెడ్‌ మండలంలో

చిలిపిచెడ్‌:  హరితహారం కార్యక్రమం మండలంలో ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు.    బద్రియా తండా, గుజిరి తండా,రాందాస్‌గూడ,గౌతాపూర్‌, జగ్గంపేట,శీలాంపల్లి గ్రామాల్లో సర్పంచులు బుజ్జిబాయి, రాకేష్‌, యాదగిరి, మాంతప్ప, స్వరూప,  కవిత గ్రామ కార్యదర్శి, ప్రజలతో కలిసి మొక్కలు నాటారు.

హరిత తూప్రాన్‌గా తీర్చిదిద్దుదాం

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ మున్సిపాలిటీలో 16 వేల మొక్కలు నాటి హరిత తూప్రాన్‌ పట్టణంగా తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయమని మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ అన్నారు. నాటిన ప్రతి మొక్కను కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సంరక్షించే బాధ్యత ప్రజలు తీసుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు.  తూప్రాన్‌ పట్టణంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామోయొద్దీన్‌, తహసీల్దార్‌ శ్రీదేవి, పట్టణ కౌన్సిలర్లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సతీష్‌చారి, వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు వెంకటేశ్‌,జ్యోతికృష్ణ, చెలిమెలప్రియాంక,కుమ్మరి రఘుపతి, పట్టణ టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. తూప్రాన్‌ మండలంలోని పలు గ్రామాల్లో లక్షా 11వేల మొక్కల పెంపకం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తూప్రాన్‌ ఎంపీపీ గడ్డిస్వప్న అన్నారు. మండలంలోని యావాపూర్‌, ఘనపూర్‌లలో జెడ్పీటీసీ రాణి, డీఎల్పీవో వరలక్ష్మి, ఎంపీడీవో అరుంధతి, ఈజీఎస్‌ ఏపీవో సంతోష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సంతోష్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.  

హోంషెడ్‌ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

 హోంషెడ్‌ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీడీ భీమయ్య గ్రామైక్య సంఘం సభ్యులకు సూచించారు. తూప్రాన్‌ మండలం యావాపూర్‌లో గురువారం జరిగిన హరితహారంలో ఆయన పాల్గొన్నారు.  జిల్లాలో12,357 గ్రామైక్య సంఘాల్లో లక్షా 30 వేలమంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు.   డీపీఎం ప్రకాశ్‌, ఏపీఎం రామకృష్ణ, సంఘం మహిళలు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు

నిజాంపేట: నిజాంపేట మండల వ్యాప్తంగా గ్రామ,మండల అధికారులు,ప్రజాప్రతినిధులు  హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ క్రమంలో నార్లపూర్‌ గ్రామంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌, మండల ప్రత్యేకాధికారి రసూల్‌బీ, ఎంపీడీవో వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు మహమ్మద్‌ గౌస్‌, సర్పంచులు అమరసేనారెడ్డి మొక్కలు నాటారు.  

అట్టహాసంగా హరితహారం

నర్సాపూర్‌ రూరల్‌: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం  హరితహారం  అట్టహాసంగా ప్రారంభమైంది.   పెద్దచింతకుంట సర్పంచ్‌ శివకుమార్‌, ఎల్లారెడ్డిగూడ తండా సర్పంచ్‌ సంతోష భిక్యానాయక్‌, అహ్మద్‌నగర్‌ సర్పంచ్‌ లలిత, చిన్నచింతకుంట సర్పంచ్‌ సురేశ్‌గౌడ్‌ వారి  గ్రామాల్లో మొక్కలు నాటారు. 


logo