మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 25, 2020 , 02:29:07

ప్రజాభాగస్వామ్యంతో పల్లెప్రగతి లక్ష్యం చేరుకోవచ్చు

 ప్రజాభాగస్వామ్యంతో పల్లెప్రగతి లక్ష్యం చేరుకోవచ్చు

బెజ్జంకి : ప్రజల భాగస్వామ్యం ఉంటే పల్లె ప్రగతి లక్ష్యం చేరుకోవచ్చని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని సత్యార్జునగార్డెన్‌లో ఆరో విడుత హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమంపై మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అధ్యక్షతన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరంగా గ్రామాల్లో కొనసాగించాలన్నారు. ప్రతి రోజు కార్యదర్శులు ఎనిమిది గంటలు గ్రామంలో ఉండాలన్నారు. సర్పంచులు సైతం చట్టానికి లోబడి పని చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు అంకితభావంతో పని చేస్తే పల్లెలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయన్నారు. మండలంలో రైతు బజార్‌ లేని గ్రామం ఉండొద్దని, ఎకరం స్థలం ఉన్న గ్రామాల్లో పార్కుల నిర్మాణాలు చేపడుతామన్నారు. రైతు కల్లాలు, గొర్రెల షెడ్ల నిర్మాణాల సంఖ్య పెంచేలా ప్రొత్సహించాలన్నారు. ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు, డీపీవో సురేశ్‌బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌, డీఎల్‌పీవో రాజీవ్‌, తహసీల్దార్‌ భిక్షపతి, ఎంపీడీవో ఓబులేశ్‌, సర్పంచ్‌ మంజుల, ఎంపీటీసీ శారద, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోశయ్య తదితరులు పాల్గొన్నారు.


logo