బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 23, 2020 , 00:14:57

మూడేండ్ల బాలిక కిడ్నాప్‌

మూడేండ్ల బాలిక కిడ్నాప్‌

  • గంటల వ్యవధిలోనే పట్టుకున్న రామాయంపేట పోలీసులు

రామాయంపేట: సికింద్రాబాద్‌ బోయినపల్లిలో ఓ మూ డేండ్ల బాలిక కిడ్నాప్‌కు గురైన ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామా యంపేట పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెం దిన ఆంజనేయులు-స్వరూప దంపతులు మూడు రోజుల కింద గొడవ పడ్డారు. దీంతో భార్య స్వరూప తన మూడేండ్ల కూతురును తీసుకుని సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌కు వెళ్లింది. బస్‌ స్టేషన్‌లో మియాపూర్‌కు చెందిన నాగమ్మ స్వరూపకు పరిచయమైంది. దీంతో సహాయం చేస్తానని మియాపూర్‌లోని తన ఇంటికి తల్లీబిడ్డలను తీసుకెళ్లింది. ఒకరోజు నాగమ్మ ఇద్దరిని ఇంట్లో ఉంచుకుంది. సోమవారం నాగమ్మ స్వరూప, కూతురు సరితను బోయినపల్లి బస్టాండ్‌కు తీసుకెళ్లింది. బస్టాండ్‌లో పాప సరిత ఏడ్వటంతో పాప తినడానికి ఏమైనా తెస్తానని  ఉడాయించింది. గంటల తరబడి చూసినా పాపను ఎత్తుకెళ్లిన నాగమ్మ రాలేదు. దీంతో అక్కడే ఉన్న బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన పాపను ఓ మహిళ కిడ్నాప్‌ చేసిందని స్వరూప స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బోయిన్‌పల్లి పోలీసులు వెంటనే నిజామాబాద్‌ వరకు అన్ని పోలీస్‌స్టేన్లకు సమాచారం చేరవేశారు. దీంతో రామాయంపేట ఎస్సై మహేందర్‌ బైపాస్‌ వద్దకు వాహనాలను తనిఖీలు నిర్వహించాడు.  ఆర్టీసీ బస్సులో మూడేండ్ల పాపతో మహిళ నాగమ్మ ఒకే సీటులో కూర్చున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు మహిళను ఆరా తీయగా, తనపేరు నాగమ్మ అని, పాపను బోయినపల్లి నుంచి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్నానని తెలిపింది. దీంతో నాగమ్మను అదుపులోకి తీసుకుని బోయిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలిక కిడ్నాప్‌ మిస్టరీని గంటల్లోనే రామాయంపేట పోలీసులు ఛేదించారు. logo