శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 20, 2020 , 23:20:03

పచ్చదనమే లక్ష్యం..

పచ్చదనమే లక్ష్యం..

  •  గజ్వేల్‌ను హరిత పట్టణంగా మార్చుదాం
  •  హరితహారంలో భాగస్వాములు కావాలి
  •  ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌ అర్బన్‌ : హరిత పట్టణంగా మార్చడానికి హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్‌లోని ఫారెస్ట్‌ నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెం చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు హరితహారానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సంవత్సరం హరితహారానికి అవసరమైన మొక్కలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని, ప్రజలంతా హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి నియోజక వర్గంలో లక్షలాది మొక్కలు నాటడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. హరితహారం ద్వారా పచ్చదనాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను  కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. అధికారులతోపాటు విద్యార్థులు, మహిళలు, యువకులు, ప్రజలంతా హరితహారం లో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు. 

హరితహారంలో స్వచ్ఛందంగా పాల్గొనాలి..

నంగునూరు : మండల కేంద్రం నంగునూరులోని నర్సరీని  మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో సత్యశ్రీతో పాటు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. త్వరలో ప్రారంభం కానున్న హరితహారంలో మం డలవ్యాప్తంగా ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపుని చ్చారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మమతాజయపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సునీతామహేందర్‌గౌడ్‌, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.   


logo