శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 20, 2020 , 23:20:01

ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌

ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌

  • దసరాలోగా గౌరవెల్లి పనులు పూర్తి  
  • ‘శనిగరం’కు రంగనాయక్‌ సాగర్‌ నుంచి కాళేశ్వర జలాలు

కోహెడ : నియంత్రిత సాగు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటను రైతులు శిరసావహిస్తున్నారని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని శనిగరంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శనిగరం ప్రాజెక్టు నుంచి వెళ్లే గంగమ్మ, తంగళ్లపల్లి, బెజ్జంకి కాల్వల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి పథకం, జలహిత అనుసంధాన కార్యక్రమంలో సదరు పనులను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం ప్రతి 5వేల ఎకరాలకు క్లస్టర్‌ను ఏర్పాటు చేసి రైతు వేదిక నిర్మించి ఏఈవోను నియమిస్తున్నారన్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఇన్ని పథకాలు అమలు చేయలేదన్నారు. 

దసరాలోగా కాళేశ్వరం జలాలు..

గౌరవెళ్లి రిజర్వాయర్‌ వరద కాల్వ పథకంలో ఉన్నందున పనులు కొంత ఆలస్యం జరిగిందని దసరాలోగా పనులు పూర్తై కాళేశ్వరం జలాలు గౌరవెళ్లి రిజర్వాయర్‌కు చేరుకుంటాయన్నారు. శనిగరం ప్రాజెక్టుకు రంగనాయక సాగర్‌ నుంచి నీరు ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. శనిగరం ప్రాజెక్టు నుంచి వెళ్లే 3 కాల్వల అభివృద్ధి పనులకు అనుమతి వచ్చిందని 400 మంది కూలీలకు పని లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

  యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 శనిగరం గ్రామంలో శనివారం పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవేందర్‌రావు ఆధ్వర్యంలో యూరియాను ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌ రైతులకు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో యూరియా పంపిణీ చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, రాష్ట్ర నాయకుడు రవీందర్‌రావు, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్‌ వంగ నాగిరెడ్డి, ఎంపీపీ  కీర్తి, జడ్పీటీసీ శ్యామల, ఏఎంసీ చైర్మన్‌ రాదమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీ  రాజిరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ పేర్యాల రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌  జయశ్రీ పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సానుభూతి

హుస్నాబాద్‌ :  పట్టణంలోని గాంధీచౌక్‌ సమీపంలో విలేకరి కొత్తపల్లి రామకృష్ణ, సీనియర్‌ బీజేపీ నాయకుడు అశోక్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహేందర్‌ తల్లి కొత్తపల్లి లక్ష్మి శుక్రవారం రాత్రి మృతి చెందారు. శనివారం ఉదయం లక్ష్మి పార్థివదేహానికి ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్‌, కౌన్సిలర్‌, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.  


logo