శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 20, 2020 , 00:13:09

ఉపాధిహామీలో రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు

ఉపాధిహామీలో రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు

n ఉమ్మడి జిల్లాకు రూ 100.53 కోట్లు మంజూరు

n ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

n సిద్దిపేటకు రూ.34.64కోట్లు, మెదక్‌కు రూ27.25కోట్లు, సంగారెడ్డికి రూ.38.64కోట్లు

n 50చ.మీ.కు రూ.56వేలు, 60చ.మీ.కు రూ.68వేలు, 75చ.మీ.కు రూ.85వేలు

n మూడు పద్ధతుల్లో కల్లాల నిర్మాణాలు చేపట్టవచ్చు

n ఏదైనా ఒక పద్ధతిలోనే చేసుకోవాలి 

n హర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా రైతాంగం

సిద్దిపేట, నమస్తేతెలంగాణ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కల్లాల (ధాన్యం ఆరబెట్టేందుకు ప్లాట్‌ఫామ్స్‌) నిర్మాణానికి ఉమ్మడి మెదక్‌ జిల్లాకు రూ.100.53 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్‌ 240 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.  ఉత్తర్వుల ప్రకారం సిద్దిపేట జిల్లాకు రూ. 34.64 కోట్లు, మెదక్‌కు రూ. 27.25 కోట్లు, సంగారెడ్డికి రూ.38.64 కోట్లు మంజారయ్యాయి. నిధుల ద్వారా రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు చేసుకోవచ్చు. మూడు విధాలుగా కల్లాల నిర్మాణం చేసుకునేందుకు ప్రభు త్వం అనుమతులనిచ్చింది. 

1)వ 50 చ.మీటర్ల కల్లానికి  రూ. 56,000, 

(2)వ  60 చ.మీటర్ల కల్లానికి రూ. 68,000, 

(3)వ 75 చ.మీటర్ల కల్లానికి రూ. 85,000 లను ప్రభుత్వం అందించనున్నది. ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉన్న రైతులు, స్వయం సహాయక సభ్యులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. వారి సొంత భూమిలో కల్లాలను నిర్మించుకోవచ్చు. రెండు విడుతలుగా డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తున్నది. పని ప్రారంభించాక సగం మేర.. పని పూర్తిచేయగానే తొలి విడుత డబ్బులను ఇవ్వనున్నది. రెండో విడుత  కల్లం పూర్తికాగానే  మిగిలిన పూర్తి డబ్బులను చెల్లిస్తారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కల్లాలను నిర్మించాల్సి ఉంటుంది. 

కల్లాల నిర్మాణం రైతులకు మేలు

రైతులు పండించిన ధాన్యం చేతికందే సమాయానికి కల్లం లేక రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నా రు. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది రైతులు ప్రమాదాల్లో చనిపోయిన సంఘటనలున్నాయి. అకాల వర్షాలతో  ధాన్యం తడిసి ముద్దవుతుంది. ఫలితంగా ధాన్యం మొలకలు రావడం, బూజు పట్టడం, వివిధ రకాలుగా ధాన్యం పాడైపోయి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఇలా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కల్లం లేక ధాన్యం సరిగా ఆరక గిట్టుబాటు ధరను సైతం పొందలేకపోతున్నారు. రైతుల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఉపాధిహామీ పథకంలో కల్లాల నిర్మించుకునేందుకు నిధులు మం జూరు చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతుల కోసం మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని రూ. 100.53 కోట్లు మంజూరు చేయించారు. రాష్ట్రంలో ఒక వెయ్యి కల్లాల నిర్మాణాలకు గాను 32 జిల్లాలకు రూ.750 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు రూ. 100.53కోట్లు మంజూరు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రైతు సొంత పొలాల్లో కల్లాల నిర్మాణం

రైతులు తమ సొంత పొలాల్లో నిర్మించుకోవచ్చు. ఆయా వ్యవసాయ క్లస్టర్ల వారీగా రైతులు, మహిళా సంఘల సభ్యులు వారి పొలాల్లో కల్లాలు నిర్మించుకోవడానికి మంజూరు చేస్తారు.  రైతు పేరు, ఊరు, జాబ్‌కార్డు నెంబర్‌, ఏ రకం యూనిట్‌ నిర్మాణం చేసుకుంటారో తదితర వివరాల దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి స్థానిక అధికారులకు అప్పగించాలి. స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో స్థానిక క్లస్టర్‌ లెవల్‌లో ఏఈవోలు, టీఏ, ఉపాధిహామీ అధికారులు,  మండల స్థాయిలో ఎంపీడీవో, ఏపీవోలు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిస్తారు. వాటిని పరిశీలన చేసిన అనంతరం  కలెక్టర్‌ మంజూరు చేస్తారు. మంజూరు పొందిన లబ్ధిదారులు దరఖాస్తులో ఏ యూనిట్‌ అయితే పెట్టారో ఆ యూనిట్‌ ప్రకారం తన కల్లాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. పని పురోగతి ప్రకారం రెండు విడుతలుగా డబ్బులను చెల్లిస్తారు.logo