మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 19, 2020 , 01:12:01

హరితహారంలో భాగస్వాములు కావాలి

హరితహారంలో భాగస్వాములు కావాలి

  •  మున్సిపల్‌చైర్‌పర్సన్‌ ఆకుల రజిత

 హుస్నాబాద్‌టౌన్‌: రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు. మున్సిపల్‌పాలకవర్గ ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ ఆకుల రజిత మాట్లాడుతూ మున్సిపల్‌కు కేటాయించిన మొక్కల పెంపకం టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నా రు. పట్టణానికి అవసరమైన మొక్కలను తెప్పించమన్నారు.  మొక్కలను కాపాడేందుకు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారంకోసం తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకుప్రతిపాదనలు పంపుతున్నట్లు చైర్‌పర్సన్‌ రజిత చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌  అనిత, మేనేజర్‌ రామకృష్ణ,  కౌన్సిలర్లు పాల్గొన్నారు.

   మూడు లక్షల మొక్కలు నాటుతాం

మద్దూరు: మండల వ్యాప్తంగా సుమారు మూడు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పా ట్లు చేసినట్లు మండల ప్రత్యేకాధికారి అమీనాభాను తెలిపారు .గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో హరితహారం కార్యక్రమ సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి మాట్లాడుతూ 25 నుంచి జరిగే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పల్లె ప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వం కల్లాలు మంజూరు చేస్తున్నట్లు, కల్లాల నిర్మాణాల కోసం రైతులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో రమాదేవి, ఈసీ పరశురాములు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

logo