శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 19, 2020 , 00:41:51

వారంలో రైతుబంధు జమ

వారంలో రైతుబంధు జమ

n ప్రతి గ్రామంలో కల్లాల నిర్మాణం

n ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం

n త్వరలోనే డయాగ్నోస్టిక్‌ కేంద్రం

n కొవిడ్‌ -19 కోసం 10 పడకల దవాఖాన

n ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

n సిద్దిపేట, నంగునూరులో రైతులకు పాసుపుస్తకాలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

n సిద్దిపేటలో స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి

n వైద్య కళాశాలలో సిబ్బందితో సమీక్ష 

n కోమటిచెరువు ఫీడర్‌ చానల్‌ పూడికతీత పనులను పరిశీలన

సిద్దిపేట కలెక్టరేట్‌/నంగునూరు: ‘రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నది.. రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు కేటాయించింది.. ఈ వానకాలంలో ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో సొ మ్ము జమ అవుతాయి’.. అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట సీ సీ గార్డెన్‌లో చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాలకు చెందిన 350 మంది రైతులకు, నం గునూరు మండల కేంద్రంలో 242 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఆర్డీవో అనంతరెడ్డితో కలిసి అందజేశారు. సిద్దిపేటలోని ఎన్సాన్‌పల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో నూతనంగా నియామకమైన స్టాఫ్‌నర్సులకు ప్రిన్సిపాల్‌ తమిళ ఆరస్‌, సూపరింటెండెంట్‌ చంద్రయ్యతో కలిసి నియామకపత్రాలను మంత్రి అందించారు. ఆయా చోట్ల వీరజవాన్‌ కర్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్య కళాశాలలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

ప్రతీ గ్రామంలో కల్లాలు

ప్రభుత్వం ప్రతీ గ్రామంలో కల్లాలు ఏర్పాటు చేస్తున్నదని, గ్రామంలో కోరిన రైతులందరికీ క ల్లాల నిర్మాణం జరిపేలా ప్రోత్సహిస్తున్నదని, ఎ క్కువ మంది ఉంటే లాటరీ పద్ధతిన ఎంపిక చేసి, మిగతా వారికి వచ్చే ఏడాది ఇచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి అన్నారు. కరోనా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొని, డబ్బులను ఖాతాల్లో జమ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.750 కోట్లతో లక్ష కల్లాలను నిర్మించనున్నట్లు తెలిపారు. కల్లాలను మూడు పద్ధతుల్లో నిర్మించనన్నుట్లు తెలిపారు. రూ.60వేలు, రూ.70వేలు, రూ.86వేలతో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, మిగతా వారికి 90 శాతం సబ్సిడీతో కల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కువ వడ్లు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లో ప్రతి రైతుకు పాసుపుస్తకం హక్కుగా వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పెండింగ్‌లో ఉన్న పాసుపుస్తకాలను త్వరితగతిన రైతులకు ఇప్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీలు మాణిక్యరెడ్డి, బాలకృష్ణ, జడ్పీటీసీ లక్ష్మి, మార్కెట్‌ కమిటీ, పీఏసీఎస్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

సంధానకర్తలుగా వ్యవహరించాలి

సీఎం కేసీఆర్‌ ప్రజలకు అత్యవసర సేవలు అందించాలన్న ఉద్దేశంతో తాత్కాలిక, కాంట్రాక్ట్‌ పద్ధతిలో వైద్య సిబ్బందిని నియమించారని మం త్రి తెలిపారు. ఉద్యోగాల్లో చేరిన స్టాఫ్‌ నర్సులు.. డాక్టర్‌కు రోగికి మధ్య సంధానకర్తగా వ్యవహరించాలన్నారు. కొవిడ్‌ -19 కోసం సిద్దిపేటలో 10 పడకల దవాఖానను మంజూరు చేసుకున్నామన్నారు. అతి త్వరలోనే డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకవస్తామని మంత్రి తెలిపారు. రోగుల పట్ల నర్సులు ప్రవర్తించే తీరు బా గుండాలన్నారు. రోగులను చిరునవ్వుతో పలుకరిస్తే వారు మానసికంగా ధైర్యాన్ని పొందుతారన్నా రు. నార్మల్‌ డెలివరీలపై దృష్టి సారించాలన్నారు. శిశు మరణాలను తగ్గించాలని, సిద్దిపేటలో ఎన్‌ఐసీయూ, కంగారు పద్ధతిలో వైద్య సౌకర్యం ఉంద ని, తొందరపడి వైద్యం కోసం బయటకు రెఫర్‌ చేయవద్దని వైద్య సిబ్బందికి సూచించారు. సిద్దిపేట మెడికల్‌ కళాశాల, జిల్లా దవాఖాన మోడల్‌గా ఉండాలన్నారు. 

నెలాఖరులోగా పూర్తి చేయాలి 

ఈ నెలాఖరులోపు మెడికల్‌ కళాశాల భవనం, ప్రిన్సిపాల్‌ క్వార్టర్స్‌ పూర్తి చేయాలని  వైద్య ఇంజినీరింగ్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ తమిళ ఆరస్‌, సూపరింటెండెంట్‌ చంద్రయ్య, వైద్య ఇంజినీరింగ్‌ అధికారులు విష్ణుప్రసాద్‌తో సమీక్షించి, మాట్లాడారు. కళాశాల భవనా ల్లో డ్రైనేజీ సమస్య ఉండవద్దని, ఎస్‌టీపీ పనులతో పాటు తాగునీటి సమస్య రాకుండా అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీటీ స్కాన్‌, ఐసీయూలో 20 బెడ్స్‌ వెం టనే తెప్పించాలని సూచించారు. వచ్చే 15 రోజు ల్లో డయాగ్నోస్టిక్‌ కేంద్రం మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు కావాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాశాల ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు.

ఫీడర్‌ చానల్‌ పనుల పరిశీలన 

కోమటి చెరువు ఫీడర్‌ చానల్‌ కాల్వ పూడికతీత పనులను మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాంతో కలిసి మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తడ్కపల్లి, ఎన్సాన్‌పల్లి చెరువులు గోదావరి జలాలతో నిండినందున కోమటి చెరువు నిండి మత్తడి దుంకే అవకాశం ఉన్నందున కాల్వలో పేరుకుపోయిన మురి కి, చెత్త, మట్టి తొలగింపును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దగ్గరుండి పనులు చేయించాలని మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సును ఆదేశించారు.

అవార్డులు వచ్చేలా పోటీ పడాలి

సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో గురువారం రాత్రి చిన్నకోడూరు మండలంలోని గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై జడ్పీచైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి పమీక్ష నిర్వహించారు. నారాయణరావుపేట మండలం పెద్దలింగారెడ్డిపల్లి, గుర్రా లగొంది గ్రామాలు జాతీయ స్థాయి అవార్డుల ను పొందాయని, చిన్నకోడూరు మండలానికి కూడా అవార్డులు వచ్చేలా అభివృద్ధిలో పోటీ పడాలని, అన్ని గ్రామాలను ఆదర్శంగా  తీర్చి దిద్దాలని ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశా రు. ఈ నెల 25న హరిత హారం ఉంటుందని, ప్రతి గ్రామంలో 2 వేలకు తగ్గకుండా మొక్క లు నాటాలన్నారు. 


logo