గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jun 17, 2020 , 23:38:54

డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు జూలైలోగా కావాలి

డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు జూలైలోగా కావాలి

n హరితహారంలో భారీగా మొక్కలు నాటాలి 

n కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలి 

n రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు  

n ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌

నంగునూరు : ‘గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు.. వైకుంఠధామాలు జూలై నెలాఖరులోపు పూర్తి కావాలి.. హరితహారంలో భారీగా మొక్కలు నాటాలి.. ప్రజాప్రతినిధులు, అధికారులు బా ధ్యతాయుతంగా పని చేసి గ్రామాల్లో పనులన్నీ పూర్తి చేయాలి’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, పనుల పురోగతి, తాగునీటి సరఫరా, హరితహారం, పశువుల షెడ్ల, కల్లాల నిర్మాణం, విత్తనాలు, ఎరువులు, రైతుబంధు, రైతుబీమా తదితర అంశాలపై హైదరాబాద్‌లోని తన నివాసం నుం చి బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ఎంపీపీ అ రుణాదేవి, జడ్పీటీసీ ఉమావెంకట్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దార్‌, పంచాయతీరాజ్‌, ఏఈవోలు, కార్యదర్శులతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. డంపింగ్‌యార్డులు, వై కుంఠధామాల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట మొదటి స్థానంలో నిలిచిందని, నంగునూరు మండ లం చివరి స్థానంలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 20న హరితహారం ప్రారంభమవుతుందని, ఉదయం 10 గంటలకు అన్ని గ్రామాల్లో ఒకే సారి నాటేందుకు సన్నాహాలు చేపట్టాలని సూచించారు. హరితహారం యాక్షన్‌ ప్లాన్‌ను మంత్రి ఆరా తీశారు. గ్రామాల్లో కాల్వలు, రోడ్డుకు ఇరువైపులా భారీగా మొ క్కలు నాటాలని ఆదేశించారు. 85 శాతం మొక్కలు బతికుండాలని, లేదంటే కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం సర్పంచులకు చర్యలు తప్పవన్నారు. వానకాలం దృష్ట్యా గ్రామాల్లో గుంతలు లేకుండా చూడడంతో పాటు ఇండ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే జరుపాలన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, నర్సరీ, నిధులు, విధు లు, అధికారాలు ప్రభుత్వం కల్పించిందన్నారు. కొన్ని గ్రామా ల్లో ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లు రాలేదని ఈ నెలాఖరులోపు వం ద శాతం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందేలా సర్పంచు, పీఏసీఎస్‌ చైర్మ న్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చొరవ చూపాలన్నారు. మండలం లో నియంత్రిత సాగుపై ఆరా తీశారు. మండలంలో 140 మం ది రైతులకు సంబంధించి సమగ్రమైన వివరాలు లేనందున రైతుబంధు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని ఏవో గీత మం త్రి దృష్టికి తెచ్చారు. వానకాలం దృష్ట్యా కరోనా పెరిగే ముప్పు ఉందని, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా పట్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలకు మొదటి ప్రాధాన్యమివ్వాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు మంత్రి సూచించారు. మూడు నెలల్లోపు గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలు జరిగేలా మండల, గ్రామ ప్రజాప్రతినధులు చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సోంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు రమేశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, తహసీల్దార్‌ భూపతి, ఎంపీడీవో సత్యశ్రీ, ఎంపీవో లక్ష్మీనారాయణ, సీనియర్‌ నాయకులు వేముల వెంకట్‌రెడ్డి, దువ్వల మల్లయ్య తదితరులు ఉన్నారు.

మెదక్‌లో 17.4 మి.మీ వర్షపాతం

మెదక్‌ రూరల్‌ : నైరుతి రుతు పవనాల ప్రభావంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు సగటు 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది. తొలకరి వర్షాలతో అన్నదాతల్లో అనందం నెలకొంది. రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా మెదక్‌ మండలంలో 45.2 మి.మీ వర్షం కురువగా రేగోడ్‌ మండలంలో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. 


logo