గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 14, 2020 , 00:31:24

కొలువుదీరిన పాలకవర్గం

కొలువుదీరిన పాలకవర్గం

n జోగిపేట్‌ ఏఎంసీ చైర్మన్‌గా మల్లికార్జున్‌, వట్‌పల్లి చైర్మన్‌గా రజినీకాంత్‌

n పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించిన   ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

వట్‌పల్లి: జోగిపేట, వట్‌పల్లి మార్కెట్‌ కమిటీలకు శనివారం కొత్తపాలక వర్గాలు కొలువుదీరాయి. ఈ మేరకు జోగిపేట, వట్‌పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో పాటు కొత్తపాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. జోగిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మాసాన్‌పల్లి మల్లికార్జున్‌గుప్తా, వైస్‌ చైర్మన్‌గా టేక్మాల్‌ మండలం కుసంగికి చెందిన పత్తిగారి విక్రమ్‌గౌడ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్టర్లుగా ఎండీ.షేక్‌షకీల్‌. కప్పాటి శ్రీనివాస్‌, నాగులపల్లి శ్రీహరి, శేరి మాణిక్‌రెడ్డి. కూనదొడ్డి నర్సింహులు, నేనావత్‌ చాంప్లా, ఎం.అశోక్‌, పి.సంతోశ్‌గౌడ్‌  డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకారం చేశారు. అందోల్‌- జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌, జిల్లా మార్కెటింగ్‌, స్థానిక వ్యవసాయ అధికారి గౌరవ సభ్యులుగా ఉండనున్నారు. వట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మన్నె రజినీకాంత్‌, వైస్‌ చైర్మన్‌గా అల్లాదుర్గం మండలం ముప్పారానికి చెందిన నవీన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్టర్లుగా మచ్కురి మధు, అబ్దుల్‌ ఘన్నీ, మేడుకుంద అప్పరావు, నేనావత్‌ చాగ్లీబాయి, బగిలీ చంద్రశేఖర్‌. అలిగే భాస్కర్‌, పానగారి శ్రీనివాస్‌గౌడ్‌, భూంరెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, ఖాదీరాబాద్‌ సొసైటీ చైర్మన్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, రేగోడ్‌ మండల వ్యవసాయ అధికారి, వట్‌పల్లి సర్పంచ్‌ గౌరవ సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్లు, పాలకవర్గం సభ్యులు  ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలి పారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త పాలకవర్గాన్ని సన్మానించారు. 

‘మార్కెట్‌' అభివృద్ధికి కృషి చేయాలి 

 నూతనంగా కొలువుదీరిన జోగిపేట, వట్‌పల్లి మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉంటూ.. మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. శనివారం జోగిపేట, వట్‌పల్లి మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో కొత్త పాలకవర్గాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు పార్టీ  బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో అందోల్‌- జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య, డీసీసీబీ మాజీ వైస్‌ చైర్మన్‌ జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మార్కుఫెడ్‌ డైరెక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాహుల్‌కిరణ్‌, మఠం భిక్షపతి నాయకులు లింగాగౌడ్‌, విజయ్‌కుమార్‌, వెంకటేశం పాల్గొన్నారు. logo