బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 13, 2020 , 23:53:12

పరుగులు తీయనున్న గజ్వేల్‌ రైల్‌..

పరుగులు తీయనున్న గజ్వేల్‌ రైల్‌..

  • ఇప్పటికే మూడు సార్లు ట్రయల్న్‌ పూర్తి
  • ఈనెల 17న గజ్వేల్‌కు రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాక
  • గజ్వేల్‌కు రైలు ప్రయాణ సౌకర్యం

గజ్వేల్‌: గజ్వేల్‌ ప్రజలకు త్వరలో రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజలకు మరికొన్ని రోజుల్లోనే రైలు కూత వినిపించనున్నది. ట్రయల్న్‌ల్రో భాగంగా గురువారం గూడ్స్‌ రైలింజన్‌ గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌ వరకు పరుగులు తీసింది. ఎప్పటికప్పుడు పట్టాలను రైలింజన్‌ యంత్రాలతో సరిచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పట్టుబట్టి గజ్వేల్‌కు రైలుమార్గాన్ని మంజూరు చేయించడంతో పాటు అతి తక్కువ సమయంతో పనులు పూర్తిచేయించారు. ఇప్పటికే వివిధ రకాల ట్రయల్న్‌ల్రు పూర్తి కాగా, ప్రయాణికులతో రైలు పరుగుకు త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌ లభించనున్నది. 2016లో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ కోమటిబండ వద్ద రైల్వే పనులకు శంకుస్థాపన చేశారు. రూ.1150 కోట్ల అంచనాతో 151 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణాన్ని 4 విడతలుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ముందుగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వరకు 33 కిలోమీటర్లు బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గం నిర్మాణ పనులు పూర్తిచేశారు.రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలని పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే పనుల పూర్తి కాగా, వివిధ రకాల ట్రయల్న్‌ల్రు పూర్తి చేసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్నది.

నాలుగు జిల్లాలకు సౌకర్యం..

మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాలకు రైలు రవాణా సౌకర్యాన్ని కల్పించనుంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు 70 గ్రామాల మీదుగా రైల్వే ట్రాక్‌ నిర్మాణం జరగనుండగా, సిద్దిపేట జిల్లాలో 10మండలాలు, 38 గ్రామాల గుండా 85 కిలోమీటర్ల దూరం వెళ్తుండగా, 13 రైల్వే స్టేషన్లు ఉంటాయి. గజ్వేల్‌ వరకు మొదటి ట్రాక్‌, బ్రిడ్జిలు, స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 7న మనోహరాబాద్‌ నుంచి నాచారం వరకు తొలి ట్రయల్న్‌ నిర్వహించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు గజ్వేల్‌ వరకు ట్రయల్న్‌ విజయవంతంగా జరిపారు. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌తో మిగతా పనులకు కొంత అంతరాయం ఏర్పడింది.

దూరభారం తగ్గుతుంది..

రైలు ప్రయాణంతో వివిధ ప్రాంతాలకు గజ్వేల్‌ నుంచి దూరంతో పాటు ప్రయాణ ఖర్చుల భారం తగ్గుతుందని స్థానికుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం, దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకల సౌకర్యం ఏర్పడడంతో పట్టణంలో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయంటున్నారు. బస్సు, ఇతర ప్రయాణ ఖర్చుల కన్నా రైలు ప్రయాణం తక్కువగా ఉండడంతో పాటు తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది. కూరగాయలు, సరుకు తరలింపునకు అవకాశాలు ఏర్పడుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు హైదరాబాద్‌కు ఏ రోజుకారోజు వెళ్లి రావడానికి వీలు కలుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకరంగా మారుతుంది. గజ్వేల్‌ నుంచి హైదరాబాద్‌కు నిత్యం బస్సులు, కార్ల ద్వారా అనేక మంది రాకపోకలు కొనసాగిస్తున్నారు. రైలు ప్రయాణం మరింత భద్రతను కల్పించనుంది.

17న స్పీడ్న్‌ టెస్ట్‌.. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాక..

ఈ నెల 17న గజ్వేల్‌ వరకు స్పీడ్న్‌ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ఈ స్పీడ్‌ రన్‌ను పరిశీలించి, అనుమతి ఇవ్వడంతో ప్రయాణ రైలు పట్టాలెక్కనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. గజ్వేల్‌లో 20 ఎకరాల్లో రూ.10 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో రైల్వేస్టేషన్‌ నిర్మాణం  పూర్తయ్యింది. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌తో గజ్వేల్‌కు గొప్ప రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ మార్గాన్ని త్వరితగతిన పూర్తిచేసినందుకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.logo