శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 13, 2020 , 00:45:43

పెండ్లి వ్యాన్‌ బోల్తా

పెండ్లి వ్యాన్‌ బోల్తా

n 12మందికి గాయాలు   n   ఇద్దరి పరిస్థితి విషమం

n క్షతగాత్రులు కామారెడ్డి జిల్లావాసులు

చేగుంట: డ్రైవర్‌ నిర్లక్ష్యంతో పెండ్లి వ్యాను బోల్తా పడి, 12మందికి గాయాలైన ఘటన మెదక్‌ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్‌ 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కునూర్‌ మండలం బాగిర్తిపల్లి గ్రామం నుంచి మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో జరిగే పెండ్లికి డీసీఎం వ్యాన్‌లో 40మందితో బయలు దేరారు. నార్సింగి మండలం జప్తిశివునూర్‌ గ్రామ సమీపంలో డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అతివేగంతో బండిని నడపడంతో రోడ్డు కిందికి వ్యాను దూసుకెళ్లిట్లు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో ఎర్రగోల్ల మల్లేశం, లక్ష్మి, లచ్చయ్య, స్రవంతి, మల్లేశం, శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్‌ దవాఖానకు తరలించినట్లు, అందులో మల్లేశం, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌ తెలిపారు.

ఆటో బోల్తా.. : మహిళ మృతి

వెల్దుర్తి : ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బస్వాపూర్‌ గ్రామ సమీపంలోని మల్లన్నగుట్ట కమాన్‌ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై గంగరాజు వివరాల ప్రకారం.. మండలంలోని మన్నెవారి జలాల్‌పూర్‌ తండాకు చెందిన ఆటో వెల్దుర్తి నుంచి ఎనిమిది మందితో నర్సాపూర్‌కు వెళ్తుండగా, బస్వాపూర్‌ సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపు తప్పి, బోల్తా పడింది. దీంతో కుకునూర్‌ గ్రామానికి చెందిన సోగోళ్ల లక్ష్మి(45) మృతి చెందగా, జంగరాయి తండాకు చెందిన మాలోతు శ్రీకాంత్‌ తలకు తీవ్రగాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. అన్నారం గ్రామానికి చెందిన మరో నలుగురు తండ్రి, కొడుకులు సాయికుమార్‌, సతీష్‌, జంగరాయి తండాకు చెందిన సరిత, నర్సింగ్‌కు గాయాలవగా, వారిని వెల్దుర్తిలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించినట్లు తెలిపారు. మృతురాలు లక్ష్మికి భర్త వెంకటయ్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


logo