బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 13, 2020 , 00:43:30

ఎన్నికల వరకే రాజకీయాలు : ఎంపీ

ఎన్నికల వరకే రాజకీయాలు : ఎంపీ

  హుస్నాబాద్‌  వేగంగా అభివృద్ధి చెందుతున్నది -ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌

 హుస్నాబాద్‌ టౌన్‌ :  పట్టణాభివృద్ధికి నిధులు కేటాయిస్తానని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలో రూ.9.80లక్షలతో 8,11వ వార్డుల్లో చేపట్టనున్న సీసీరోడ్డు, మంచినీటి పథకాలకు ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మరింత అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. పట్టణ అభివృద్ధికి ఎంపీ సైతం నిధులు కేటాయించాలని సతీశ్‌కుమార్‌ కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అనిత, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, కమిషనర్‌ రాజమల్లయ్య, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.logo