బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 13, 2020 , 00:41:55

‘సీజనల్‌'పై అప్రమత్తంగా ఉండాలి

‘సీజనల్‌'పై అప్రమత్తంగా ఉండాలి

 హుస్నాబాద్‌ డివిజన్‌ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి రామ్మూర్తి  l పలు గ్రామాల్లో డ్రైడే నిర్వహణ

అక్కన్నపేట : ప్రతి ఒక్కరూ సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డివిజన్‌ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి రామ్మూర్తి అన్నారు. శుక్రవారం మండలంలోని చౌటపల్లిలో గ్రామీణ ఆరోగ్య పారిశుధ్య పోషకార కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమలతో వచ్చే వ్యాధులు, కరోనా వైరస్‌ వ్యాప్తి , వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  గ్రామంలో డ్రై డే  చేపట్టారు. అనంతరం మలేరియా,  డెంగీ, బోధకాలు, దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో  సర్పంచ్‌  రమేశ్‌, ఉపసర్పంచ్‌ పొశెట్టి, వైద్య, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.  

నిల్వ నీటిలో దోమలు వృద్ధి

హుస్నాబాద్‌ రూరల్‌ : మండలంలోని మీర్జాపూర్‌, భల్లూనాయక్‌తండా, జిల్లెలగడ్డ, పోతారం(ఎస్‌), వంగరామయ్యపల్లి, గాంధీనగర్‌, మాలపల్లి  గ్రా మాల్లో  పాలకవర్గాలు, హెల్త్‌ సిబ్బంది ఆధ్వర్యం లో డ్రైడే  నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ డ్రమ్ములు, కూలర్లలో నిల్వనీటిని పారబోశారు. నిల్వనీటిలో దోమ లు వృద్ధిచెంది రోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో  సర్పంచ్‌లు, హెల్త్‌ సిబ్బంది ఉన్నారు. 

తంగళ్లపల్లిలో డ్రైడే

కోహెడ : తంగళ్లపలిలో సర్పంచ్‌ పాము నాగేశ్వరి డ్రైడే  నిర్వహించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వలు శుభ్రం చేయించారు.  కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

వ్యాధుల నిర్మూలణకు ప్రత్యేక చర్యలు

 చేర్యాల : కరోనా, క్షయతోపాటు సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో సీజనల్‌ వ్యాధులు అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చేర్యాల దవాఖాన పీపీపీ యూనిట్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ హాజరై  వైద్యశాఖ అధికారులు, సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్‌  లింగం, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మురళి ఉన్నారు. 


logo