శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 13, 2020 , 00:32:06

త్వరలో 2 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

త్వరలో 2 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

 l రూ. 24 కోట్లతో   సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి l కలెక్టర్‌ ధర్మారెడ్డి 

 వెల్దుర్తి :  జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జిల్లాకు రూ. 34 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి  మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మంగళపర్తిలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జిల్లాకు రూ. 34కోట్ల సీసీ రోడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ. 24 కోట్లతో  రోడ్ల నిర్మాణ పనులు జరిగాయని మిగతా పనులను త్వరలో పూర్తి అవుతాయన్నారు. జిల్లాకు 5,100 రెండు పడక గదుల ఇండ్లు మంజూరు కాగా, 3200 ఇండ్లు వివిధ దశల్లో పనులు జరుగుతుండగా, 11 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. ఒక గ్రామంలో ఇప్పటికే ప్రారంభం జరిగిందని, ఈ నెలాఖరు నాటికి మరో పది గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. జూలై  వరకు 2వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి, నిరుపేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో  ప్రభుత్వం, అధికారులు చేస్తున్న సూచనలను ప్రజలు తప్పక పాటించాలని కోరారు.  వీరివెంట రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ స్నేహబంధు నర్సాపూర్‌ అధ్యక్షుడు రాఘవేంద్రరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌ గౌడ్‌, సర్పంచ్‌ రామకృష్ణారావు, తహసీల్దార్‌ ఆనంద్‌రావు, ఎంపీడీవో జగదీశ్వరాచారి, నాయకులు నరెందర్‌రెడ్డి, ఆంజనేయులు, కృష్ణాగౌడ్‌, అశోక్‌గౌడ్‌, యాదగిరి, శ్రీను, కృష్ణ ఉన్నారు. 


logo