గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 10, 2020 , 04:03:50

ఆలోచించి పంటలేస్తెనే.. పైసలొస్తయి

ఆలోచించి పంటలేస్తెనే.. పైసలొస్తయి

n ప్రాధాన్యతా పంటల సాగుపై అవగాహన కల్పించాలి 

n నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ట్‌ 

n జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి హరీశ్‌రావు

ఆలోచించి పంటలేస్తెనే బాగా పైసలొస్తయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఉమ్మడి జిల్లా పరిధిలో విస్తృతంగా పర్యటించారు. మెదక్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రాధాన్యతా పంటల సాగుపై అధికారులకు సూచనలు చేశారు. నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ట్‌ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సిద్దిపేట కలెక్టరేట్‌లో పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రామాయంపేట కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. హవేళిఘనపూర్‌ పరిధిలోని రాజ్‌పేట వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు.    

- ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌

గజ్వేల్‌ రూరల్‌ : ‘భార్యాపిల్లలతో కలిసి కష్టం చేస్తున్నవ్‌.. ఆలోచించి పంటలేస్తెనే మంచిగా పైసలొస్తయ్‌, చలికాలంలో టమాటా పెడితే కిలో రూ.5 కూడా రావు.. అదే ఇప్పుడైతే కిలో రూ.50 వస్తాయి’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బంగ్లావెంకటాపూర్‌ సమీపంలో కాళేశ్వరం కాలువ నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఇందుకోసం బంగ్లావెంకటాపూర్‌ వ్యవసాయ పొలాల మీదుగా వెళ్తున్న క్రమంలో పొలం పక్కనే పనులు చేసుకుంటున్న రైతు సంది బలరాంను మంత్రి పలకరించారు. ఏయే పంటలు సాగు చేస్తున్నావని అడిగారు. ఆలోచించి పంటలు సాగు చేయాలని, అప్పుడే మంచి దిగుబడి వస్తుందని రైతుకు సూచించారు. logo