మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 10, 2020 , 00:36:42

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- ఎమ్మెల్యే రామలింగారెడ్డి

చేగుంట : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రం చేగుంటలో దీప్తి పాఠశాల వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీమూబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెప్రగతితో గ్రామాల రూపుఖలు మారాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, బాణపురం కృష్ణారెడి, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, కొటారి అశోక్‌, తాసిల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. 

జాగ్రత్తలు పాటించండి -జర్నలిస్టులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచన

రామాయంపేట : జర్నలిస్టులు భౌతిక దూరం పాటించడంతోపాటు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని ఎమ్యెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మెదక్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే రామాయంపేట బైపాస్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు అన్ని రకాల వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నదన్నారు. కావాలనే కొంత మంది చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎమ్మెల్యే వెంట ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, రామాయంపేట పుర పాలిక చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి, పుట్టి యాదగిరి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, బొర్ర అనిల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

 


logo