శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 10, 2020 , 00:22:31

కాళేశ్వరంతో సస్యశ్యామలం చేస్తాం

కాళేశ్వరంతో  సస్యశ్యామలం చేస్తాం

కాలువల ద్వారా చెరువులకు నీటి తరలింపు 

మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రాయపోల్‌ : కాళేశ్వరం నీటితో ఉమ్మడి జిల్లాలోని పంటపొలాలను సస్యశ్యామలం చేస్తామని, త్వరలోనే కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు చొరవ తీసుకుంటున్నామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సయ్యద్‌నగర్‌ వద్ద కొండపోచమ్మ సాగర్‌ నుంచి రామాయంపేట వెళ్లే కాలువ పనులను ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వానకాలంలోనే రామాయంపేట, శంకరంపేట, ఉప్పర్‌పల్లి చెరువులను నింపేందుకు యుద్ధప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా, జడ్పీటీసీ యాదగిరి పాల్గొన్నారు. 

ముమ్మరంగా కాలువ పనులు 

రామాయంపేట : రామాయంపేట కెనాల్‌ కాలువ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్‌ వెళ్తున్న మంత్రి రామాయంపేటలోని మెదక్‌ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడారు. రామాయంపేటకు అతి త్వరలో కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, పురపాలిక చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి, పుట్టి యాదగిరి, కౌన్సిలర్లు తదితరులున్నారు.


logo