మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 09, 2020 , 03:08:54

వచ్చే నెలలో సీఎం కేసీఆర్‌తో ‘డబుల్‌' గృహప్రవేశాలు

వచ్చే నెలలో సీఎం కేసీఆర్‌తో ‘డబుల్‌' గృహప్రవేశాలు

n నర్సపురం డబుల్‌ బెడ్‌రూం  ఇండ్లు దేశానికి ఆదర్శం  

n డిమాండ్‌ ఉన్న పంటలే  రైతులతో సాగు చేయించండి

n చింతమడక ప్రగతికి  రూ.414.75 లక్షలు 

n సమీక్షా సమావేశాల్లో  మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ/సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట నర్సపురం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను వచ్చే నెలలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా సా మూహిక గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయిం చినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే రైతులు సాగు చేసేలా చైతన్యపర్చాలని, సీడ్స్‌ సాగు పెంచితే ప్రతి రైతుకు ఆదాయం పెరుగుతుందని చెప్పారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌రూంలు, పండ్లు, కూరగాయలు, స్వీట్‌కార్న్‌ పంటల సాగుపై మంత్రి సమీక్షించారు. లబ్ధిదారుల సర్వే చేసిన జిల్లా అధికారులతో చర్చించారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజామ్మిల్‌ఖాన్‌, జిల్లా ట్రైనీ ఐఏఎస్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి రామలక్ష్మి, అరబిందో బ్రేయర్‌ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నర్సపురంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. గతంలో ఇక్కడ డీఆర్‌వోగా పని చేసి ప్రస్తుతం నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌గా సేవలందిస్తున్న చంద్రశేఖర్‌ను ఐదు రోజుల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరారు. నివాసయోగ్యులైన వారి కుటుంబాల వివరాలను బుధవారం లోపు సమర్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో 1200 ఎకరాల్లో స్వీట్‌కార్న్‌ సాగు చేయాలన్న ఆలోచనపై ముందస్తుగా ఒప్పందం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, కిలోకు రూ.8 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమీప గ్రామా ల్లో 200 ఎకరాల్లో స్వీట్‌కార్న్‌ సాగుపై శ్రద్ధ పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. విత్తన సాగు పెరిగేలా జిల్లాలోని సీడ్‌ కంపెనీ ప్రతినిధులతో సమీక్షించి, వారి సహకా రం తీసుకోవాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిని సూచించారు. ప్రాధాన్యత పంటల సాగులో భా గంగా జిల్లాలో 95శాతం గ్రామాలు ఏకగ్రీవం చే శాయని, గ్రామ, మండల ప్రణాళిక ఆధారంగా నాలుగు లక్షల 99వేల ఎకరాల్లో వానకాలంలో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నట్లు జిల్లా ప్ర ణాళిక సిద్ధమైందని మంత్రి హరీశ్‌రావు తెలపారు.

రైతు రుణమాఫీ, రైతుబంధుపై సమీక్ష

జిల్లాలో రైతు రుణమాఫీకి 20వేల మంది రైతులున్నారని, వీరికి రూ.25 వేల లోపు అప్పు ఉన్న 8600మంది రైతులకు రుణమాఫీ వచ్చిందని, ఇంకా 12వేల మందికి రుణమాఫీ విషయంలో వారి బ్యాంకు ఖాతాల్లో ఆధార్‌ కార్డు అనుసంధానం అప్‌డేట్‌ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. శుక్రవారం జరిగే సమీక్షలో ఏ ఒక్క రైతుకు రైతుబంధు పెండింగ్‌లో ఉండొద్దని ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 126 రైతు వేదికలు నిర్మించతలపెట్టినట్లు తెలిపారు.

చింతమడక ప్రగతికి రూ.414.75 లక్షలు 

చింతమడక గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనులకు రూ.414.75 లక్షలు విడుదలైనట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సుడా కార్యాలయంలో సోమవారం సాయంత్రం చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్‌ల్లోని అర్హులైన 55 మంది లబ్ధిదారులకు చెక్కులను మంత్రి అందజేశారు. గ్రా మాల్లో ఇండ్లను పూర్తి స్థాయిలో తొలగించాలని ఆ గ్రామస్తులను కోరారు. లబ్ధిదారులకు ఆరు ర కాల యూనిట్లలో షాపులు, ట్రాక్టర్లు, పౌల్ట్రీ, హార్వేస్టర్స్‌, జేసీబీలు, కార్లు యూనిట్లుగా పొందారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

గంగమ్మతల్లికి పూజలు 

నంగునూరు : నంగునూరు గ్రామ చౌడుచెరు వు గోదావరి జలాలతో మత్తడి దుంకడంతో సోమవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు జలహారతి పట్టి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలను నంగునూరుకు తెచ్చుకున్నామన్నారు.


logo