మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 09, 2020 , 01:13:59

ముమ్మరంగా సాగిన పనులు

ముమ్మరంగా సాగిన పనులు

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితభూంరెడ్డి

దుబ్బాక టౌన్‌ :  పట్టణ ప్రగతిలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత నిచ్చామని  ప్రజల సహకారంతో ప్రతి వార్డులో కౌన్సిలర్లు భాగస్వామ్యులై పనులు చేశారని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌  వనితా భూంరెడ్డి అన్నారు. మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం జోరుగా కొనసాగింది. పాలకవర్గం సభ్యులు, అధికారులు వార్డుల్లో  పారిశుధ్య పనులను పర్యవేక్షించి ప్రజా సమస్యలను గుర్తించారు. దుంపలపల్లి 4వ వార్డులో కౌన్సిలర్‌ ఇల్లందుల శ్రీనివాస్‌తో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. 12, 17వ వార్డుల్లో జరుగుతున్న పనులను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవన్నారు.  

జోరుగా స్మృతి వనం పనులు...

పట్టణంలోని రేపల్లెవాడ సమీపంలో నిర్మిస్తున్న స్మృతి వనం పనులు జోరుగా సాగుతున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత అన్నారు.  పనులను ఆమె పరిశీలించారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థం స్మృతివనంలో నాటిన మొక్క లు పెరిగాయని, వారం, పది రోజుల్లో స్మృతి వనం పనులను పూర్తి చేసి ఎమ్మెల్యే రామలింగారెడ్డితో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం 17వ వార్డులో ఎస్‌ఆర్‌ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు.

పరిశుభ్రతతో రోగాలు దరి చేరవు

 చేర్యాల : వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే రోగాలు దరిచేరవు అని చేర్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపరాణి అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా  మున్సిపాలిటీ పరిధిలోని 2,4,9,11వ వార్డుల్లో చైర్‌పర్సన్‌ పర్యటించారు.ఈ సందర్భంగా పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని వాటర్‌ట్యాంకు వద్ద గడ్డిని తొలిగించడంతో పాటు 4,11వ వార్డుల్లో డ్రైనేజీలను శుభ్రం చేయించారు.ఈ సందర్భం గా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా వైరస్‌  ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు

  చివరి రోజు ముమ్మరంగా  పారిశుధ్య పనులు

 మండల వ్యాప్తంగా  ప్రత్యేక పారిశుధ్య పనులు చివరి రోజు  ముమ్మరంగా కొనసాగించారు. గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులు, కార్యదర్శులు పర్యటించి ప్రజలకు పలు సూచనలు చేశారు.మురుగు నీటి కాల్వల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడంతో పాటు మొదటి రోజు ప్రారంభించిన పనుల్లో మిగిలిపోయిన వాటి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

 చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

మిరుదొడ్డి :వానకాలంలో  వచ్చే వ్యాధులతో  జాగ్రత్తలు పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారి స్వర్ణలత అన్నారు. మండల పరిధిలోని చెప్యాల, రుద్రారం గ్రామాల్లో జరుగుతున్న మూడో విడుత పల్లె ప్రగతి పనులను ఎంపీపీ సాయిలుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు విధులు  నిర్వహిస్తూ చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రావు, సర్పంచ్‌లు  లక్ష్మీయాదగిరి, మల్లన్నగారి శాంతమ్మ పాల్గొన్నారు.

ముగిసిన  పల్లెప్రగతి 

దుబ్బాక:  గ్రామాల్లో ,పచ్చదనం, పరిశుభ్రతకు పాటుపడాలని   ఎంపీడీవో భాస్కరాశర్మ అన్నారు.  మండలంలోని హసన్‌మీరాపూర్‌, అప్పనపల్లి, గోసాన్‌పల్లి రఘోత్తంపల్లి  గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. మూడో విడుత పల్లెప్రగతి కార్యక్రమాలు ముగియటంతో ...గ్రామాల వారీగా ప్రగతి కార్యక్రమాలతో పాటు పలు సమస్యలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. స్వచ్ఛతపై ప్రజలను చైతన్యవంతం చేశారు.  ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.  

ప్రగతి పనులు పరిశీలన 

కొమురవెల్లి : పల్లెల పరిశుభ్రత లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతికి శ్రీకారం చుట్టారని ఎంపీపీ తలారి కీర్తన తెలిపారు. మండలంలోని మర్రిముచ్చాలలో జరుగుతున్న మూడో విడుత పల్లె ప్రగతి పనులను  ఎంపీపీ  కీర్తన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రగతి పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీలను పైసలు వస్తున్నాయ అని అడుగడంతో ప్రతి వారం వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ కీర్తన మాట్లాడుతూ పల్లెప్రగతి పనులతో గ్రామాల రూపు రేఖలు మారడంతో పాటు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన వచ్చిందన్నారు. 

   గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు

మద్దూరు: మండలంలోని జాలపల్లి, రేబర్తి, వంగపల్లి, బెక్కల్‌ తదితర గ్రామాల్లో చివరి రోజు ప్రత్యేక పారిశుధ్య పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చెత్తాచెదారాన్ని తొలిగించి, వీధులను శుభ్రం చేశారు.  వారం రోజుల పాటు జరిగిన ప్రత్యేక పారిశుధ్య పనులతో గ్రామాలన్ని పరిశుభ్రంగా మారాయి. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు వరలక్ష్మి, సవిత, భాగ్యలక్ష్మి, బాలరాజు పాల్గొన్నారు.


logo