బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 09, 2020 , 01:09:00

పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కారం

 పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కారం

అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి 

అమీన్‌పూర్‌ :  పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కారమయ్యాయని మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా పలు వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, వైస్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, కౌన్సిలర్లు కవిత శ్రీనివాస్‌రెడ్డి, బాశెట్టి కృష్ణ, కల్పనాఉపేందర్‌రెడ్డి, కొల్లూరి మల్లేశ్‌, బిజిలీరాజు, మల్లేశ్‌, యూ సుఫ్‌, పద్మావతి, లావణ్యశశిధర్‌రెడ్డి, నవనీత జగదీశ్‌, మున్నా, నాయకులు తలారి రాములు, ప్రమోదర్‌రెడ్డి  పాల్గొన్నారు. 

ఆర్సీపురం పరిధిలో..

రామచంద్రాపురం : పట్టణ ప్రగతిలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించడం జరిగిందని కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా ఆర్సీపురం డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్‌కాలనీలో బల్దియా సిబ్బంది పారిశుధ్య పనులను చేపట్టారు. కాలనీలో జరుగుతున్న పారిశుధ్య పనులను కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌ పరిశీలించారు. అదేవిధంగా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో నిర్వహించిన పట్టణ ప్రగతి పనులను కమిషనర్‌ వెంకటమణికరణ్‌, కౌన్సిలర్‌ రవీందర్‌రెడ్డి పరిశీలించారు.   


logo