మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 09, 2020 , 01:04:01

కిలో కొర్రమట్ట రూ.700

కిలో కొర్రమట్ట  రూ.700

సిద్దిపేట టౌన్‌ : మృగశిర కార్తె ప్రారంభం కావడంతో సోమవారం చేపలకు భలేగా గిరాకీ పెరిగింది. కార్తె రోజు చేపలు తినాలనే ఆనవాయితీ ఉండగా, కొనుగోళ్లకు వినియోగదారులు ఎగబడ్డారు. సిద్దిపేటలోని ఇంటిగ్రెటెడ్‌ ఫిష్‌ మార్కెట్‌ సోమవారం కొనుగోలుదారులతో సందడిగా మారింది. నిన్న మొన్నటి వరకు రూ.500 నుంచి రూ.550 వరకు చేపల ధర పలికింది. మృగశిర కార్తె కావడంతో ఏకంగా రూ.700వరకు పెరిగింది. చేపల కొనుగోలుకు వచ్చినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో లేదు. మాస్క్‌లు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. చేపల విక్రయాల దారులు పూర్తిగా నిబంధనలు అతిక్రమించారు.logo