శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 08, 2020 , 00:17:33

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తం

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తం

దుబ్బాక టౌన్‌:   వానకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  దుబ్బాక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వనిత సూచించారు. ఆదివారం 10 గంటల10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను కమిషనర్‌ నర్సయ్యతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రతి ఆదివారం నిర్వహించే డ్రై డే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని కౌన్సిలర్లు దేవలక్ష్మి, మూర్తి సంధ్యారాణి, కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజ, యాదగిరి, దేవుని లలిత  వార్డుల్లో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  జాగ్రత్తతో  వ్యాధులు దరి చేరవు

హుస్నాబాద్‌టౌన్‌: ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేని యెడల డెంగీ, మలేరియా, కరో నా వచ్చే అవకాశాలు ఉన్నాయని హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అనితలు అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం పట్టణంలోని 17,20వ వార్డుల్లో  ఇంటింటికీ తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని రజిత, అనితలు కోరారు. పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మురుగు కాల్వల్లో దోమల నివారణ కోసం మందును స్ప్రేచేయడం, బ్లీచింగ్‌ చల్లడం, చెత్తాచెదారం తొలిగింపు పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్‌  రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ  వెంకట్‌, వార్డుకు చెందిన కౌన్సిలర్లు వల్లపు రాజు, వాల సుప్రజ  ఉన్నారు.

ముమ్మరంగా సాగుతున్న ‘ప్రత్యేక’ పనులు

ఎంపీడీవో రాంప్రసాద్‌

చేర్యాల : ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే   సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయని ఎంపీడీవో రాంప్రసాద్‌ తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీలు, కార్యదర్శులు పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా బావులు, చేదబావులు, బోర్ల దగ్గర ము రుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు.చెత్తను ఇంటి బయట వేయకుండా చెత్తబుట్టలో వేయాలని మహిళలకు  అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా చిట్యాల, ముస్త్యాల సర్పంచ్‌లు రామ్మోహన్‌రావు,  ఎల్లారెడ్డి మాట్లా డుతూ ప్రత్యేక పారిశుధ్య పనులతో గ్రామాలు అభివృద్ధి  చెం ది, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. ఖాళీ ప్రదేశాల్లో ఉన్న కలుపు మొక్కలను స్థల యజమానులు తొలిగించుకోవాలని నోటీసులు జారి చేస్తున్నట్లు తెలిపారు.

పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దూరం

కొమురవెల్లి : పల్లె ప్రగతితో పల్లెలు పరిశుభ్రంగా మారాయని  సర్పంచ్‌  స్వామిగౌడ్‌ అన్నారు.  మండలంలోని రసూలాబాద్‌లో మూడో విడుత పల్లె ప్రగతి పనుల్లో భాగంగా సర్పంచ్‌ స్వామిగౌడ్‌ వార్డుసభ్యులతో కలిసి పారిశుధ్య పనులతో పాటు వీధులను శుభ్రం చేయడంతో పాటు ఇంటింటికీ తిరుగుతూ పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.   కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్‌, వార్డుసభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

    పరిశుభ్రత మనందరి బాధ్యత

మద్దూరు:  పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారినట్లువంగపల్లి సర్పంచ్‌  భాగ్యలక్ష్మి అన్నారు. గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

గ్రామాల్లో  పల్లెప్రగతి కార్యక్రమాలు

దుబ్బాక: స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ఎంపీడీవో భాస్కరాశర్మ అన్నారు. దుబ్బాక మండలంలో కమ్మర్‌పల్లి, పోతారం, అచ్చుమాయపల్లి తదితర గ్రామాల్ల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. 

 కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు

తొగుట:  పల్లె ప్రగతి 3వ విడుత కార్యక్రమం జోరుగా సాగుతుంది. మండలంలోని పల్లెపహాడ్‌లో సర్పంచ్‌ గుగ్లోతు చిన్న రజిత ఆధ్వర్యంలో పారిశుధ్య నివారణ చర్యలు నిర్వహిస్తున్నారు. 


logo