శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 07, 2020 , 00:19:45

రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి

రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి

నారాయణఖేడ్‌: రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్‌ పీఏసీఎస్‌ ద్వారా ఎరువుల పంపిణీని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రుణమాఫీ చేయడం, రైతుబంధు సహాయమందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పీఏసీఎస్‌లను బలోపేతం చేసే దిశగా పీఏసీఎస్‌లకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందని, నారాయణఖేడ్‌ పీఏసీఎస్‌కు రూ.50 లక్షల నిధులు కేటాయించినప్పటికీ మరిన్ని నిధుల కోసం ఉన్నతాధికారులను కోరినట్లు  తెలిపారు. కార్యక్రమం లో పీఏసీఎస్‌ చైర్మన్‌ శోభారాణి అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ ఎం.ఏ.బాసిత్‌, మాజీ సర్పంచ్‌ ఎం.ఏ.నజీబ్‌, నాయకులు అభిషేక్‌ శెట్కార్‌, సాయి రాం, రమేశ్‌చౌహాన్‌, లయక్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి

కల్హేర్‌: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పొమ్యానాయక్‌ తండాలోని భవానీమాత, సేవాలాల్‌ ఆలయ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒత్తిళ్లను జయించేందుకు ఆధ్యాత్మిక చింతనే మార్గమన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, సర్పంచ్‌ చితికిబాయి, ఎంపీటీసీ తడ్గూరి సంగప్ప, మార్డి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జలంధర్‌ తదితరులు పాల్గొన్నారు. logo