గురువారం 02 జూలై 2020
Siddipet - Jun 05, 2020 , 00:18:16

గజ్వేల్‌ దవాఖానలో ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సలు

గజ్వేల్‌ దవాఖానలో ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సలు

గజ్వేల్‌ అర్బన్‌ : ప్రభుత్వ దవాఖానలో ఆర్థోపెడిక్‌ శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. వర్గల్‌ మండ లంలోని తున్కిఖాల్సా గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ ప్రమాదవశాత్తు ఇంటి వద్ద పని చేస్తుండగా కాలు విరిగింది. బుధవారం సా యంత్రం గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానకు 108 అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ప్ర భుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ మహేశ్‌, ఆర్థోపెడిక్‌ వైద్యులు సుధాకర్‌, సుర్యప్రతాప్‌, వంశీలు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్‌ మహేశ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సూచనలతో గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలతోపాటు శస్త్ర చికిత్సలునిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇకపై గజ్వేల్‌ దవాఖానలో ఆర్థోపెడిక్‌ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 


logo