ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 04, 2020 , 00:26:37

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

గత వానకాలంలో 204 ఎకరాల్లో పంటకు నష్టం

నాణ్యతలేని విత్తనాలతో మోసం..

కంపెనీల నుంచి రూ. 23.68 లక్షల పరిహారం ఇప్పించాం

జిల్లా వ్యవసాయశాఖ అధికారి నరసింహరావు

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ)

‘గత వానకాలంలో నకిలీ పత్తి విత్తనాలు సాగు చేసి పలువురు రైతులు నష్టపోయారు.. ఈ సారి కూడా రైతులను మోసం చేయడానికి వ్యాపారు లు రెడీగా ఉన్నారు.. నకిలీలపై పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి’.. అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహరావు హెచ్చరించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో ‘నమస్తే తె లంగాణ’తో మాట్లాడారు. ఈ సారి పత్తిసాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు అంచనా వేశారన్నారు. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు నకిలీ, నాణ్యత, జన్యుప్రమాణాలు లేని విత్తనాలు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో రైతులను సంప్రదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల నుంచి రశీదు తీసుకుని, నాణ్యమై న విత్తనాలు తీసుకోవాలన్నారు. గత వానకాలం లో జిల్లాలో 11మంది డీలర్లు నకిలీ విత్తనాలు రై తులకు అంటగట్టారని, వారు విత్తనాలు సాగు చే సి నష్టపోయారన్నారు. నకిలీ విత్తనాలతో రైతుల ను మోసం చేసిన కంపెనీల నుంచి పరిహారం ఇ ప్పించామన్నారు. ఒక కంపెనీ విత్తనాలు సాగు చే సి 162ఎకరాల్లో నష్టపోయిన 70మంది రైతులకు రూ.19.47 లక్షలు పరిహారం ఆ కంపెనీల నుంచి అందించారన్నారు. అలాగే మరో 7 కంపెనీల విత్తనాలను 43 ఎకరాల్లో సాగు చేసి నష్టపోయిన 15 మంది రైతులకు రూ.4.21 లక్షలు ఇప్పించామని, ఇటీవల కాలంలో విత్తనాల కంపెనీల నుంచి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం వసూలు చేయిం చి రైతులకు అందించడం కూడా ఇదేనని చెప్పా రు. గత పరిస్థితుల దృష్ట్యా రైతులు అప్రమత్తం గా ఉండాలని, వ్యవసాయ అధికారుల సూచన లు, సలహాలు తీసుకోవాలన్నారు. విత్తన వ్యాపారుల మాటలు నమ్మొద్దని, మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ పరంగా వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని సూచించారు.logo