ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 04, 2020 , 00:22:22

పల్లెలను ప్రగతి పథంలో నడిపించాలి

పల్లెలను ప్రగతి పథంలో నడిపించాలి

జిల్లాపరిషత్‌ వైస్‌చైర్మన్‌ రాజిరెడ్డి, హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత

కొనసాగుతున్న ప్రగతి పనులు 

 హుస్నాబాద్‌టౌన్‌:  పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లాపరిషత్‌ వైస్‌చైర్మన్‌ రాజిరెడ్డి,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, మున్సిపల్‌ వైస్‌చైర్‌ పర్సన్‌ అనితలు అన్నారు. పట్టణంలోని 3,4వ వార్డుల్లో పట్టణప్రగతిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌  రాజమల్లయ్య, మాజీఎంపీపీ  వెంక ట్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఎండి. అన్వర్‌,  కౌన్సిలర్‌ కోమటి స్వర్ణలత, ఉన్నారు. 

ఐనాపూర్‌, రసూలాబాద్‌లో ఎంపీడీవో పర్యటన

కొమురవెల్లి : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మూడో విడుత పల్లె ప్రగతి పనులు ఆయా గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మండలంలోని ఐనాపూర్‌, రసూలాబాద్‌లో ఎంపీడీవో మల్లికార్జున్‌ గ్రామాల్లో పర్యటిం చి  పరిసరాలను పరిశీలించడంతో పాటు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీ టీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

దుబ్బాక:  గ్రామాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని దుబ్బాక ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి సూచించారు.   పద్మ నాభంపల్ల్లిలో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

   కొనసాగుతున్న ప్రత్యేక  పారిశుధ్య పనులు

చేర్యాల :  ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయి.   మొదటి రోజు పాదయాత్రలో గుర్తించిన మురికి గుంటలో బుధవారం మొరంపోసి పూ డ్చి వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధల్లో చెత్త  తొలగిం చి, ముళ్ల కంపలు, పొదలను తొలిగించారు.మండలంలోని ఆకునూరులో ఎంపీడీవో రాం ప్రసాద్‌ పర్యటించి సర్పంచ్‌ చీపురు రేఖ, ఎంపీటీసీ  శ్రీధర్‌, జీపీ సిబ్బంది, వార్డు సభ్యులకు సూచనలు చేశారు.

ప్రజలు పరిశుభ్రతను పాటించాలి

    మిరుదొడ్డి:   ప్రజలు పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని ఎంపీడీవో సుధాకర్‌రావు అన్నారు. బుధవారం జంగపల్లి గ్రామంలో కొనసాగుతున్న మూడో విడుత పల్లె ప్రగతి పనులను సర్పంచ్‌  యాదగిరితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మేఘమాల, వార్డు సభ్యులు  పాల్గొన్నారు.logo