శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 03, 2020 , 00:17:29

రాష్ట్ర ఏర్పాటు ఫలితమే గోదావరి జలాలు

రాష్ట్ర ఏర్పాటు ఫలితమే గోదావరి జలాలు

  • భూనిర్వాసితులకు అన్నివిధాల అండగా ఉంటాం 
  • సీఎం కేసీఆర్‌ అంకుఠిత దీక్ష పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం 
  • రాష్ట్ర సాధన ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయి..
  • అవతరణ వేడుకల్లో  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌:  ‘సీఎం కేసీఆర్‌ అంకుఠిత ఆమరణ నిరాహార దీక్ష.. ఎన్నో పోరాటాలు.. ఎంతో మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం సాధించుకున్నాం.. నేడు ఆ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయి’.. అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలో నిరాడంబరంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్‌, కూర రఘోత్తంరెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌తో కలిసి పాల్గొన్నారు. రంగధాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి గోదావరి జలాలతో నివాళు లర్పించారు.

కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీ య జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రి జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లా డుతూ.. రాష్ట్రం సాధించుకున్న ఫలాలు నేడు సిద్దిపేట జిల్లాకు అందాయన్నారు. గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాకు రావడంతో కల సాకారమైందన్నారు. 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గోదావరి జలాలు విడుదల చేసుకున్నామన్నా రు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, విద్యాసాగర్‌రావు, అమరులను ఇవాళ గుర్తు చేసుకుంటున్నామన్నారు. అమరులు, జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తుందన్నారు. శానికి తెలంగాణ  ఆదర్శంగా నిలిచిం దన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధికి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, అధికార యంత్రాం గం, రాత్రింబవళ్లు కృషి చేసి అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేలా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన  నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటూ వారికి అం డగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజామ్మిల్‌ఖాన్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రాజారెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని తన నివాసంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.logo