శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 02, 2020 , 02:54:16

దివ్యాంగ కవలలకు దాతల సహకారం

దివ్యాంగ కవలలకు దాతల సహకారం

సిద్దిపేట రూరల్‌: మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన దివ్యాంగ కవల సోదరురులు శ్రీనాథ్‌, రాముకు సహకరించేందుకు దాతలు ముందుకొచ్చారు. మే 28న ‘నమస్తే తెలంగాణ’లో ‘ దివ్యాంగ కవలలకు ఎంత కష్టమొచ్చే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. దివ్యాంగ కవల సోదరుల తండ్రి కిషన్‌ స్నేహితులైన 1990-91 పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.25100 ఆర్థిక సాయం చేయగా, సిద్దిపేటలోని హనుమాన్‌నగర్‌ రెడ్డి సంఘం అధ్యక్షుడు చెందిరెడ్డి మహేశ్‌రెడ్డి 50 కిలోల బియ్యాన్ని వారికి అందించారు.logo