శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 02, 2020 , 02:52:10

గజ్వేల్‌లో తిరుపతి లడ్డూ విక్రయాలు

గజ్వేల్‌లో తిరుపతి లడ్డూ విక్రయాలు

గజ్వేల్‌ అర్బన్‌: గజ్వేల్‌ పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో తిరుపతి లడ్డూలను విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌తో తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనానికి వీలు కాకపోవడంతో భక్తుల సంతోషం కోసం టీటీడీ సభ్యులు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్‌ వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి లడ్డూలను విక్రయిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బుక్క వెంకటేశం లడ్డూలను భక్తులకు అందుబాటులో తీసుకువచ్చారు. అలాగే, కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో కూడా లడ్డూలను విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు.


logo