శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - May 28, 2020 , 00:10:59

కొండపోచమ్మ ఆలయం వద్ద ఏర్పాట్ల పరిశీలన

కొండపోచమ్మ ఆలయం వద్ద ఏర్పాట్ల పరిశీలన

జగదేవ్‌పూర్‌: మండలంలోని తీగుల్‌నర్సాపూర్‌ కొండపోచమ్మ దేవాలయం వద్ద శుక్రవారం సీఎం కేసీఆర్‌ దంపతులు చేపట్టబోయే చండీయాగం ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. ఆలయ పరసరాలతో పాటు, యాగం చేయబోయే ప్రదేశం, ఆలయం మెట్లను గుడి లోపల బయట క్షుణంగా పరిశీలించిన మంత్రి, సర్పంచ్‌ రజిత, ఆలయ చైర్మన్‌, మెగా కంపెనీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. సీఎం ఆలయానికి వచ్చే రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేయాలన్నారు. యాగశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌ తేజకు సూచించారు. ఆలయంతో పాటు ఆలయం చుట్టూ ఉన్న స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలసి పరిశీలించారు. రేపటిలోగా అన్ని పనులు పూర్తి చేసి, యాగానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి అమ్మవారికి పూజలు చేశారు.

చండీయాగానికి ఏర్పాట్లు

మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ సూచనల మేరకు వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌తేజ ఆధ్వర్యంలో కొండపోచమ్మ ఆలయ దక్షిణ భాగంలో ఉన్న అతిథి గృహం వద్ద చండీయాగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతులు రుత్వికులు బస చేసేందుకు అతిథి గృహాలను సిద్ధం చేస్తున్నారు. యాగశాలలోకి రుత్వికులు వచ్చేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలను సుమారు 200 మంది ఈజీఎస్‌ సిబ్బందితో కొండ చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు పరసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో గజ్వేల్‌ ఏసీపీ, సీఐలు ట్రాఫిక్‌ ఏసీపీ పలువురు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.logo