శనివారం 11 జూలై 2020
Siddipet - May 24, 2020 , 23:52:53

సిద్దిపేటలో.. ‘స్వచ్ఛ పాఠశాల’

సిద్దిపేటలో.. ‘స్వచ్ఛ పాఠశాల’

  • రూ.50 లక్షలతో ఏర్పాటు.. 
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌: స్వచ్ఛ సిద్దిపేట పాఠశాలను రూ.50 లక్షలతో 4వ వార్డులో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో 1, 4వ వార్డుల్లో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు, హరిప్రియనగర్‌లో పొడి వ్యర్థాల వనరుల సేకరణ కేంద్రాల్లో తడి, పొడి చెత్త వేరుగా విభజించే యంత్రాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 4వ వార్డులో ఏర్పాటు చేయబోయే స్వచ్ఛ పాఠశాలలో విద్యార్థులకు, మహిళా సంఘాలకు మనం ఎలా స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛత ఎలా సాధించవచ్చనే అంశాలపై పాఠాలు చెబుతామని మంత్రి అన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను సిద్దిపేటలో ప్రారంభించుకున్నామన్నారు. చెత్తను నిత్యం సేకరించడం వల్ల పట్టణం పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇక్కడకు వచ్చి స్ఫూర్తినిచ్చిన డాక్టర్‌ శాంతికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, చెత్తను విభజించే సమయంలో చేతిగ్లౌజ్‌లు కావాలని కార్మికులు మంత్రికి విన్నవించగా, త్వరితగతిన వాటిని ఇప్పించాలని ము న్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కార్మికులకు సేఫ్‌ సిద్దిపేట మాస్క్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్‌, దీప్తి నాగరాజు తదితరులున్నారు. 

పలువురికి మంత్రి హరీశ్‌రావు పరామర్శ 

ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుడు వంగ గాల్‌రెడ్డి కుమారుడు నీరంజన్‌రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించగా, వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించాడు. మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గూడురి శ్రీనివాస్‌ సోదరుడు ఆగదాస్‌ ఇటీవల మరణించాడు. మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కడవేర్గు ధర్మయ్య మృతి చెందగా, వారి కుటుంబాలను మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. logo