మంగళవారం 26 మే 2020
Siddipet - May 24, 2020 , 02:04:46

తుక్కాపూర్‌ 3వ పంప్‌ వెట్‌ర‌న్‌‌ విజయవంతం

తుక్కాపూర్‌ 3వ పంప్‌ వెట్‌ర‌న్‌‌ విజయవంతం

తొగుట: తుక్కాపూర్‌ (మల్లన్న సాగర్‌) పంప్‌హౌజ్‌లోని 3వ మోటర్‌వెట్‌ర‌న్‌ విజయవంతమైంది. శనివారం తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌లో 3వ మోటర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌, ఎత్తిపోతల ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, మెగా ప్రెసిడెంట్‌ గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రారంభమైన మోటర్‌ ద్వారా కొన్ని నిమిషాల తర్వాత మల్లన్న సాగర్‌ డెలివరీ సిస్టంలో నీళ్లు వచ్చాయి. అక్కడి నుంచి అక్కారం పంప్‌హౌస్‌కు గోదావరి జలాలు పరుగులు పెట్టాయి. ఈ సందర్భంగా  కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే సాగు, తాగు నీరు అందించడానికని, సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. 

మల్లన్న సాగర్‌ నుంచి 1.25 లక్షల ఎకరాలకు, కొండపోచమ్మ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో 8.33 లక్షల ఎకరాలకు సాగునీరందించడం జరుగుతుందన్నారు. వచ్చే డిసెంబర్‌ నాటికల్లా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో ఈఈ గోపాలకృష్ణ,   ఏవీపీ సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.  


logo