మంగళవారం 26 మే 2020
Siddipet - May 23, 2020 , 00:49:59

లాభాల పందిరి

లాభాల పందిరి

 తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి

 పందిరి సాగుపై మహిళా రైతు దృష్టి

 ఏడాదికి రూ.5లక్షలకు పైగా ఆదాయం

తూప్రాన్‌ రూరల్‌ : పిట్ల వరలక్ష్మీ గ్రామైక్య సంఘంలో సభ్యురాలు. ఆమెకు ఎకరం వ్యవసాయ పొలం ఉంది. భర్త చెన్నయ్య సూచన మేర కు నాలుగేండ్ల క్రితం పందిరిసాగుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెకు స్త్రీనిధి బ్యాంక్‌ ద్వారా రూ.లక్ష రుణ సాయం లభించింది. ఈజీఎస్‌ పథకం ద్వారా సబ్సిడీపై రూ.95 వేలు వచ్చాయి. ప్రభుత్వం అందించి న నిధులతో భూమిని చదును చేసి పందిరి సాగుకు కావాల్సిన పద్ధతు లు పాటించారు. రాతికడ్డీలు వాటికి కావాల్సిన బెండింగ్‌ వైర్లు ఏర్పా టు చేసి పంటలకు నీరందించడానికి డ్రిఫ్ట్‌ పరికరాలు అమర్చారు. పందిరిసాగులో తీగజాతి కూరగాయలైన కాకర, బీర, సొరకాయలను పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. పండించిన పంటలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో ఆటోట్రాలీ రిక్షాల్లో నగరానికి తరలిస్తున్నారు. ఇలా పండించిన పంటకు పెట్టుబడులు పోగా రూ.2లక్షల 50వేల ఆదాయం లభిస్తున్నది. యేడాదిలో రెండు పంటలు పండిస్తూ రూ.5 లక్షల ఆదాయం పొందుతూ కుటుంబ సభ్యులు సంతోషంతో జీవిస్తున్నది.

పందిరిసాగులో లాభాలు

పందిరిసాగు పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలు పొందుతున్నాం. మా కుటుంబం అంతా పందిరిసాగుపైనే ఆధారపడి జీవిస్తున్నది. రుణసాయం, సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందించారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో మా కుటుంబానికి ఉపాధి లభిస్తుంది.     

 - పిట్ల వరలక్ష్మీ, మహిళా రైతు


logo