మంగళవారం 26 మే 2020
Siddipet - May 22, 2020 , 00:56:33

పెండింగ్‌ పనులు పూర్తిచేయండి: మంత్రి హరీశ్‌రావు

పెండింగ్‌ పనులు పూర్తిచేయండి: మంత్రి  హరీశ్‌రావు

గజ్వేల్‌ : మున్సిపల్‌ పరిధిలో పెం డింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణ పనులను  పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో గురువారం జరిగిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇందిరాపార్కు నుంచి కోట మైసమ్మ వరకు రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. మున్సిపల్‌ పరిధిలో 75 గజాల లోపు విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్న వారు మున్సిపల్‌ అనుమతి పొందాల్సిన అవసరం లేదని ప్రజలకు సమాచారం చేరవేయాలన్నారు. 

డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక

గజ్వేల్‌ పట్టణం సంగాపూర్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అర్హులకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 28న మున్సిపల్‌, ఇంజినీరింగ్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ లోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ  కొలిక్కి రావాలని సూచించారు. సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.logo