మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - May 22, 2020 , 00:56:25

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.7,57,739

కొండపోచమ్మ హుండీ ఆదాయం  రూ.7,57,739

జగదేవ్‌పూర్‌: కొండపోచమ్మ దేవాలయ హుండీ లెక్కింపును గురువారం ఉమ్మడి మెదక్‌ జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ హేమంత్‌కుమార్‌, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ రజితరమేశ్‌ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లెక్కించినట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు. భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించిన హుండీ ఆదాయం రూ.7,57,739 వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారికి హుండీ ద్వారా వచ్చిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, ఆలయ అధికారులు వెంకట్‌రెడ్డి, సిబ్బంది కనకయ్య, హరి, చిన్న, అంజయ్య, సుధాకర్‌, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.


logo