సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - May 19, 2020 , 23:19:04

రైతులకు ‘సహకార’ రుణాలు

రైతులకు ‘సహకార’ రుణాలు

డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి

సంగారెడ్డి : జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకు నుంచి రైతులకు పంట రుణాలతో పాటు వ్యాపార రుణాలు ఇస్తామని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సదాశివపేట సహకార సంఘం ఆవరణలో రూ. 25వేల లోపు రుణమాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదాశివపేట సహకార సంఘానికి రూ.50 లక్షలను కేటాయించామన్నారు. మంజూరు ఇచ్చిన నిధులను వినియోగించుకుని రైతులు ఆర్థికంగా ఎదుగాలని ఆకాంక్షించారు. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.25వేల లోపు రుణాలను ప్రభుత్వం ఒకేసారి మాఫీ చేయడం సంతోషకరమన్నారు. తీసుకున్న రుణాలతో బర్రెలు, గొర్రెలు, కోళ్ల పెంపకానికి వినియోగించుకోవాలన్నారు. కార్పొరేట్‌ బ్యాంకులకు దీటుగా సహకార సంఘాల బ్యాంకులు పని చేస్తాయన్నారు. రైతుల డిమాండ్‌ను బట్టి అదనంగా రుణాలు కావాలంటే మరో రూ.50 లక్షల నిధులు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంకు సీఈవో శ్రీనివాస్‌, బ్రాంచి మేనేజర్‌ మమత, పేట పీఏసీఎస్‌ చైర్మన్‌ రత్నాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ పాండునాయక్‌, డైరెక్టర్లు శేఖర్‌, మహిపాల్‌, విఠల్‌రెడ్డి, మాజీ డైరెక్టర్‌ రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo