శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - May 19, 2020 , 23:18:13

తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు కాళేశ్వరం జలాలు

తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు కాళేశ్వరం జలాలు

మల్లన్నసాగర్‌ ద్వారా తరలింపునకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌

చేర్యాల : కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సాధ్యమైనంత ఎక్కువ మేర వినియోగించుకోవాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పానికి మరో కొత్తకోణం ఆవిష్కృతం కానున్నది. జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం రెండో దశలో నిర్మించిన తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను కొమురవెల్లి మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలు పంపింగ్‌ చేసి, రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపి, అక్కడి నుంచి కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు మండలాలకు సాగు నీటిని అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన గోదావరి జలాల వినియోగం సమీక్షలో తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్‌ నుంచి జలాలను తరలింపునకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నీటిపారుదల శాఖ అధికారులు మల్లన్నసాగర్‌ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని అందించేందుకు తయారు చేసిన ప్రతిపాదనలకు మోక్షం కలుగడంతో  కరువు సీమగా పేరున్న చేర్యాల ప్రాంతం మరో కోనసీమగా మారనుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.logo