ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - May 19, 2020 , 00:35:20

దుబ్బాక తొలి బడ్జెట్‌ రూ.38.34 కోట్లు

దుబ్బాక తొలి బడ్జెట్‌ రూ.38.34 కోట్లు

బడ్జెట్‌ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సోలిపేట,  అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌

దుబ్బాక టౌన్‌: దుబ్బాక మున్సిపాలిటీ తొలి అంచనా బడ్జెట్‌ 2020-21 సంవత్సరానికిగాను 38.34 కోట్లుగా ప్రవేశపెట్టింది. సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డి అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మె ల్యే రామలింగారెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ హాజరయ్యారు. మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా పాలకవర్గం ఆమో దం తెలిపింది. అనంతరం జరిగిన అత్యవసర సమావేశంలో చేపట్టిన పనుల బిల్లులు, చేపట్టబోయే పనులకు సంబంధించి పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దుబ్బాక మున్సిపాలిటీకి ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. దుబ్బాక పట్టణానికి రింగురోడ్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలను ప్రారంభిస్తామన్నారు. మొదటి విడుతగా చేర్వాపూర్‌ మారెమ్మ దేవాలయం నుంచి నల్ల చెరువు మీదుగా దుంపలపల్లి రోడ్డు నుంచి డబుల్‌బెడ్రూం ఇండ్ల వరకు రింగురోడ్డును నిర్మిస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మిషన్‌భగీరథ తాగునీరు ప్రతి ఇంటికీ అందనున్నదన్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో భగీరథ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కౌన్సిలర్లకు సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అధికం సుగుణాబాలకిషన్‌గౌడ్‌, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo