శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - May 15, 2020 , 23:53:13

వానకాలం పంటలకు గోదావరి నీళ్లు

వానకాలం పంటలకు గోదావరి నీళ్లు

  • కాలువ పనులు వేగవంతం చేయాలి
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 
  • ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి 40కిలో మీటర్ల మల్లన్నసాగర్‌ కాలువ పరిశీలన
  • సిద్దిపేటలో రంజాన్‌ కానుకల పంపిణీ
  • 12వ ప్యాకేజీలోని ప్రధాన కాలువను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

తొగుట : వానకాలం పంటలకు గోదావరి నీళ్లు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా తొగు ట మండలం తుక్కాపూర్‌ మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌ నుంచి దు బ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు వెళ్లే ప్రధాన కాలువ ను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. తుక్కాపూర్‌ నుంచి మొద లు కొని కాలువ చివరి వరకు తిరుగుతూ అధికారులను పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలువల మిగతా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాలువ 40కిలోమీటర్ల దూరం వరకు ఉంటుందని, ప్రధాన పనులు పూర్తయ్యాయని, వానకాలం పంటలకు నీళ్లు అందిస్తామని మంత్రి అన్నారు. ఈ కాలువ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో 62,312 ఎకరా లు, సిద్దిపేట నియోజకవర్గంలో 39,409 ఎకరాలు, సిరిసిల్ల ని యోజకవర్గంలో 21,119 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నా రు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట వద్ద కాలువ మీద పంట పొలాలకు రాకపోకలు చేసేందుకు బ్రిడ్జి కావాలని ఎంపీటీసీ స్వామి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తడ్కపల్లిలోని ఊర చెరువుకు బండారుపల్లి మీదుగా నీళ్లు ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులతో కాలువ మ్యాప్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్‌, ఆర్డీవో అనంతరెడ్డి, మెగా ప్రెసిడెంట్‌ గోవర్ధన్‌రెడ్డి, ఈఈ శ్రీనివా స్‌, ఏవీపీ సత్యనారాయణ, ఐబీ ఈఈ శ్రీనివాస్‌, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, డీఈఈ హరికిషన్‌, ఏఈఈలు విష్ణువర్దన్‌రెడ్డి, మమత, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

రంజాన్‌ కానుకల అందజేత

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేటలోని ఆరు వార్డుల్లో మొదటి విడుత 500మంది ముస్లింలకు తన నివాసంలో మంత్రి రంజాన్‌ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలని కానుకలు పంచుతు న్నామన్నారు. కరోనా ప్రజలందరి సమస్య అని, మనమంతా ఐక్యంగా పోరాడాలన్నారు. సిద్దిపేట కరోనా ఫ్రీ జిల్లా అయిందన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo