శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - May 14, 2020 , 22:37:45

ఆదాయ మార్గాలను అన్వేషించాలి

ఆదాయ మార్గాలను అన్వేషించాలి

గజ్వేల్‌అర్బన్‌ : ‘మున్సిపాలిటీలు ప్రభుత్వ నిధుల కోసం వేచిచూడొద్దు... స్వయంగా ఆదాయ మార్గాలను అన్వేషించాలి... ఇతర మున్సిపాలిటీల కన్నా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ బడ్జెట్‌ వాస్తవిక ఖర్చులకు దగ్గరగా  రూపొందించారు’ అని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ అన్నారు. గురువారం గజ్వేల్‌ ఐవోసీలో గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ సమావేశంలో 2020-21 బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.25కోట్లు కేటాయించడంతో పాటు 2019-20 బడ్జెట్‌ సవరణను పాలక వర్గం ఆమోదించింది. సమావేశానికి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి అధ్యక్షత వహించగా, బడ్జెట్‌ వివరాలను మున్సిపల్‌ కమిషనర్‌  కృష్ణారెడ్డి చదివి వినిపించారు. ఖర్చుల వివరాలను క్షుణ్ణంగా తెలియజేయడంతో అదనపు కలెక్టర్‌ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్‌, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

నర్సరీల పరిశీలన.. 

గజ్వేల్‌ రూరల్‌ : గజ్వేల్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో నర్సరీలను గురువారం అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు పరిశీలించారు. అహమ్మదీపూర్‌, పిడిచేడ్‌ గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.  వారి వెంట ఎంపీడీవో దామోదర్‌రెడ్డి, ఎంపీవో, ఏపీవో ఉన్నారు.


logo