మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - May 14, 2020 , 22:37:46

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు

  • సీఎం కేసీఆర్‌ పిలుపుతో రాష్ట్రంలో 25వేల మందికి సాయం 
  • టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి
  • సంగారెడ్డిలో నిత్యావసర సరుకుల పంపిణీ

సంగారెడ్డి టౌన్‌ :  ‘రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు... సీఎం కేసీఆర్‌ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా 25వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం’ అని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని టీఎన్‌జీవో భవన్‌లో కలెక్టర్‌ హనుమంతరావు, టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్‌తో కలిసి ఆయన జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అదే విధంగా టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేశామని, ప్రస్తుతం కరోనా కట్టడికి ఉద్యోగుల సంఘం పని చేస్తున్నదన్నారు. టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ మాట్లాడుతూ సంఘం తరఫున ఒక్క రోజు వేతనం రూ.30కోట్లను విరాళంగా ప్రభుత్వానికి అందజేశామన్నారు. అనంతరం సంగారెడ్డి కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఒక్క కరోనా కేసు లేదన్నారు. 800 మంది వలస కార్మికులు, ఇతర రాష్ర్టాల్లో ఉన్న వారు, విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర కార్యదర్శి రవి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుశీల్‌బాబు, నర్సింహులు, సభ్యులు వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌, నిర్మల, రాజ్‌కుమారి, సుధారాణి, జి.శ్రీనివాస్‌, భాస్కర్‌, గౌస్‌, వేణు తదితరులు పాల్గొన్నారు. 


logo