ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - May 14, 2020 , 00:40:15

నిబంధనలు పాటించని వారికి జరిమానాలు

నిబంధనలు పాటించని వారికి జరిమానాలు

చేర్యాల/ నర్సాపూర్‌/ చిన్నశంకరంపేట: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చేర్యాల పట్టణంలో తిరుగుతున్న 47 మందికి రూ.200 చొప్పున రూ.11,200 జరిమానా విధించినట్లు మున్సిపల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సాయిశంకర్‌ తెలిపారు. మున్సిపల్‌ ఇన్‌చార్జ్జి కమిషనర్‌ పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు బుధవారం మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి ఫైన్లు వేస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై సత్యనారాయణ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాస్క్‌లు లేకుండా రోడ్లపైకి వచ్చిన 15 మందికి ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున రూ.15వేలు జరిమానా విధించారు. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ సూచించారు. ఆయన చిన్నశంకరంపేట పోలీసు స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. పోలీసు స్టేషన్‌కు మ్యాడం బాలకృష్ణ బహూకరించిన వాటర్‌ ఫిల్టర్‌ను ప్రారంభించారు. గజ్వేల్‌లో మాస్క్‌లు ధరించని వారికి మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి రూ.7 వేల జరిమానాలు విధించారు. మెదక్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి దుకాణాల్లో తనిఖీలు చేసి, మాస్కులు ధరించని వారికి రూ.34,600 జరిమానాలు విధించారు.logo