ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - May 14, 2020 , 00:40:16

పేదలకు అండగా..

పేదలకు అండగా..

 • గుమ్మడిదల: మండలంలోని గుమ్మడిదలలో మైత్రి ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉదయ్‌కుమార్‌ తాపి మేస్త్రీలకు, బుడగ జంగాలకు కూరగాయాలను పంపిణీ చేశారు. అలాగే బొంతపల్లిలో టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు లక్ష్మారెడ్డి,  సాయిలు, మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ 40 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • బొల్లారం: టీఆర్‌ఎస్‌ యువత నాయకుడు, మైచారిటీ ఫౌండర్‌ యాదిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధికి చెందిన శ్రీరామ కాలనీలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. 
 • కౌడిపల్లి: మండల పరిధిలోని మహమ్మద్‌నగర్‌లో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్‌ దివ్యమహిపాల్‌రెడ్డి గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • సిద్దిపేట టౌన్‌: టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నాయకురాలు పొన్నమల్ల సువర్ణలక్ష్మి 6వ వార్డులోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదే విధంగా వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిరుపేద వధువు వివాహానికి బియ్యం అందజేశారు. 
 • తూప్రాన్‌ రూరల్‌: మండలం కిష్టాపూర్‌లో 17మందికి సర్పంచ్‌ పిట్లపోచయ్య ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • మిరుదొడ్డి: మండల పరిధిలోని అల్వాలలో మాజీ ఎంపీపీ భాస్కరాచారి   నిత్యావసర సరుకులను పేదలకు సర్పంచ్‌ ఎనగంటి కిష్టయ్యతో కలిసి పంపిణీ చేశారు.
 • రామచంద్రాపురం: ఆర్సీపురం డివిజన్‌లోని లక్ష్మీగార్డెన్‌లో వ్యాపారవేత్త అరవ రామకృష్ణ ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ సింధూఆదర్శ్‌రెడ్డి పేదలకు సరుకులు పంపిణీ చేశారు. శ్రీనివాస్‌నగర్‌కాలనీలోని 6,7వ బ్లాక్‌ల్లో పీఎన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుష్పనగేశ్‌ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • హత్నూర: హత్నూర ఐటీఐ కాలనీలో యక్షికూడలి, విత్తన సంఘం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 
 • జిన్నారం: మండలంలోని ఖాజీపల్లి, మాధారం, కొడకంచి గ్రామాల్లో మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనీల్‌కుమార్‌ సహకారంతో ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఖాజీపల్లి ఎంపీటీసీ భార్గవ్‌ పారిశుధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులు, గ్రామ సేవకులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
 • తొగుట: తొగుట ఎంపీడీవో కార్యాలయంలో స్వార్డ్‌, మైచాయిస్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీష్‌రెడ్డి, స్వార్డ్‌ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శివకుమారి 96 మంది గ్రామ పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. 
 • చిలిపిచెడ్‌: మండల పరిధిలోని చండూర్‌లో గొట్టం జోగయ్య కుటుంబానికి జడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డి సహకారంతో ఉప సర్పంచ్‌ రాజ్‌కుమార్‌, నాయకుడు ఖాసీం నిత్యావసర సరుకులు అందజేశారు.


logo