మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - May 13, 2020 , 00:21:41

కరోనా కట్టడికి సహకరించాలి

కరోనా కట్టడికి సహకరించాలి

సిద్దిపేట కలెక్టరేట్‌ : ‘మాస్క్‌లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. మాస్క్‌లు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తాం..’ అని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేటలో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న ఆరుగురికి మొత్తం రూ. 2100 జరిమానాలు విధించి, అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాదారులకు జరిమానా విధించారు. అలాగే, మాస్క్‌లు లేకుండా వాహనాలపై తిరుగుతున్న వారికి, మాస్క్‌లు ధరించకుండా షాపులను నిర్వహిస్తున్న యజమానులకు జరిమానాలు విధించారు. అనంతరం హౌసింగ్‌ బోర్డులో ఉన్న తడి, పొడి చెత్త సేకరణ యూనిట్‌ నిర్మాణ పనులను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. నివాస గృహాల నుంచి సేకరించే తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రణాళికపై చర్చించారు. అసంపూర్తి పనులన్నీ వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌, బిల్‌ కలెక్టర్‌ యాదగిరి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo