శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - May 12, 2020 , 00:22:58

ఆకలి తీరుస్తున్నారు..

ఆకలి తీరుస్తున్నారు..

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా దాతల సహకారంతో పలుచోట్ల అన్నదానాలు  చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 23వ వార్డు కౌన్సిలర్‌ ఇంద్రమోహన్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. అలాగే అక్షయపాత్ర ఫౌండేషన్‌ సౌజన్యంతో పేద ప్రజలు, కూలీలు, కార్మికులకు భోజనం ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆకలి ఫౌండేషన్‌ కన్వీనర్‌ రాజశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో దాత రైనీగారి సందీప్‌గౌడ్‌ సహకారంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో సుమారు 250 మంది, దవాఖాన సిబ్బందికి అన్నదానం చేశారు. పుల్కల్‌ మండల పరిధిలోని చౌటకూర్‌ వద్ద వార్డు మెంబర్‌ సురేఖ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో మాట్లాడి వలస కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తూప్రాన్‌ పట్టణ శివారులోని బైపాస్‌ రోడ్డులో తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, తహసీల్దార్‌ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్లు నాగవర్ధన్‌, రాజిరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ సంపత్‌, రెవెన్యూ సిబ్బంది వలస కార్మికులకు అన్నదానం చేశారు. మనోహరాబాద్‌ మండలం పర్కిబండ సర్పంచ్‌ పూల అర్జున్‌ జాతీయ రహదారిపై వలస కూలీలకు ఆహార ప్యాకెట్లు, తాగునీటి బాటిళ్లను అందజేశారు. రామాయంపేటలో వలస కార్మికులకు అల్పాహారం అందిజేస్తున్న సీఐ.నాగార్జునగౌడ్‌ను మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా రామాయంపేట పట్టణంలో జాతీయ రహదారిపై అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్‌తో కలిసి మున్సిపాలిటీ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ వలస కార్మికులకు అన్నం వడ్డించారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లేపల్లి లలితాసోమిరెడ్డి పేదలకు అన్నదానం చేశారు. భెల్‌లో భెల్‌ బీఎంఎస్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు వర్మ, ప్రధానకార్యదర్శి రవిశంకర్‌లు పేదలకు అన్నదానం చేశారు. జహీరాబాద్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు నామ రవికిరణ్‌ పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు.


logo