ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - May 11, 2020 , 01:22:11

అన్నదాతల ఆనందం

అన్నదాతల ఆనందం

  • సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు జల, పుష్ప, క్షీరాభిషేకాలు

కొమురవెల్లి/నంగునూరు/రేగోడ్‌ : రైతుల కష్టం తెలిసిన సీఎం కేసీఆర్‌ ఆపత్కాలంలోనూ రుణమాఫీతోపాటు పెట్టుబడి సాయాన్ని అందించారు. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని  చేస్తున్న సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు రైతులతోపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు క్షీరాభిషేకాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో ఎంపీపీ కీర్తన,  జడ్పీటీసీ సిద్ధప్ప, వైస్‌ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు లాల్‌భాగన్‌ తదితరులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేట పెద్దచెరువులోకి గోదావరి జలాలు రావడంతో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎండీ కమాల్‌షరీఫ్‌, రంగు రాజుగౌడ్‌, జాజాల కనకరాజు, చందు, ఇజారుద్దీన్‌, పెద్ద సత్తయ్య, యాదగిరి, భాస్కర్‌, రవీందర్‌ తదితరులు జల, క్షీరాభిషేకం చేశారు. మెదక్‌ జిల్లా రేగోడ్‌ పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద చైర్మన్‌ రాజుయాదవ్‌, బస్టాండ్‌ వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బుచ్చయ్య అధ్యక్షతన క్షీరాభిషేకాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం  జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్‌, ఎంపీటీసీ నర్సింహులు పాల్గొన్నారు. 


logo