ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - May 10, 2020 , 00:54:59

గ్రీన్‌ జోన్‌లో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు

గ్రీన్‌ జోన్‌లో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు

  • సామాజిక దూరం పాటిద్దాం 
  • ముఖానికి మాస్క్‌ లేకుంటే రూ.వెయ్యి జరిమానా 
  • ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : ‘సిద్దిపేట గ్రీన్‌ జోన్‌లో ఉందని నిర్లక్ష్యం వద్దు.. ముఖానికి మాస్క్‌ లేకుండా బయట  తిరిగితే రూ.వెయ్యి జరిమానా వేస్తాం.. రేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 సా యాన్ని రెండు నెలల నుంచి ప్రభుత్వం అందిస్తుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి కరుణ కాంతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 1400 కుటుంబాలకు, తాడూరి బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో కోవిద సహృదయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 400 మంది చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులను అందించి, మహిళలకు సీమంత కార్యక్రమాలను నిర్వహించారు. బాలాజీ గార్డెన్‌లో నియోజకవర్గ పరిధిలోని 300 మంది క్రైస్తవులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది సేవాకార్యక్రమాలు చేస్తున్నారని, దాదాపు ఇప్పటికే 12 వేల మందికి సాయం అందించామన్నారు. సిద్దిపేట జిల్లా కరోనా ఫ్రీ అయిందని బయటకు రావొద్దన్నారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. సహృదయ ఫౌండేషన్‌ పౌండర్‌ అనూహ్యరెడ్డి కరోనా ప్రారంభం నుంచి రూ.1.40 కోట్లు ఖర్చు చేశారని, సిద్దిపేటలో దాదాపు రూ.10 లక్షల విలువ గల నిత్యావసర సరుకుల కిట్స్‌ను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. 21 మంది గర్భిణులకు రూ.10 వేల విలువ గల వెండి సామగ్రి, పట్టువస్ర్తాలు అందించి సీమంతాలు చేయించడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆనంద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, నీలకంఠ సమాజం అధ్యక్షుడు లోక లక్ష్మీరాజం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, కౌన్సిలర్‌ గ్యాదరి రవీందర్‌, పాస్టర్‌ స్టీవెన్‌ జాన్‌     కుమార్‌ తదితరులు ఉన్నారు. సిద్దిపేటలోని శ్రీరామకుంట్ల శ్మశాన వాటిక సుందరీకరణ పనులను సాయంత్రం మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పిడకలతో దహన సంస్కారాలు జరుపాలని మున్సిపల్‌ కమిషనర్‌, ఏఈలను ఆదేశించారు. 

కూలిన ఇండ్లకు పరిహారం అందజేత.. 

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నంగునూరు, చిన్నకోడూ రు మండలాల్లో కూలిన ఇండ్లకు రూ.2 లక్షల 9 వేల నష్టపరిహారాన్ని మంత్రి హరీశ్‌రావు అందజేశారు. నంగునూరు మండలంలోని 11 గ్రామాల్లో 47 మందికి రూ.లక్షా 50 వేల 400 పరిహారం చెక్కులు, చిన్నకోడూరు మండలంలోని 9మందికి రూ. 28,800 చెక్కులను అందజేశారు. సిద్దిపేట రూరల్‌, నారాయణ రావుపేట మండలాలకు చెందిన ఆరుగురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు.

సిద్ధంగా సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్‌

సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భవన నిర్మాణ పనులను శనివారం సాయం త్రం  మంత్రి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని  కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మంత్రి వెంట తెలంగాణ సాహిత్య అకాడమీ  చైర్మన్‌ నందిని సిద్దారెడ్డి, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. 



logo