బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - May 09, 2020 , 00:25:11

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అందోల్‌, నమస్తే తెలంగాణ/ వట్‌పల్లి: కరోనా విపత్తు సమయంలో కూడా సీఎం కేసీఆర్‌ మాత్రం రైతులకు రుణాలు మాఫీ చేసి, పంట పెట్టుబడి ఇవ్వడం సాహసమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కొనియాడారు. శుక్రవారం జోగిపేటలోని జోగినాథ్‌ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అందోలు ప్రాథమిక సహకార సంఘంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కాగా, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మార్క్‌ఫేడ్‌ డైరె క్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి పంచె కట్టుతో అలరించారు. ఇదిలా ఉండగా, అంచు పంచెకట్టి,  నెత్తికి తువ్వాల చుట్టి ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ రైతన్న అవతారమెత్తారు. స్వగ్రామం పోతులబొగుడలోని వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి ఎమ్మెల్యే పని చేశారు.


logo